అప్పుడు రాముడు.. ఇప్పుడు పాల‌స్తీనా.. ఒవైసీ చుట్టూ వివాదాలు!

ఎంఐఎం పార్టీ అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ.. అస‌దుద్దీన్ ఒవైసీ పార్ల‌మెంటు స‌భ్య‌త్వం ర‌ద్దు చేయాలంటూ.. ఉత్త‌రాదికి చెందిన రెండు మూడు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి

Update: 2024-06-28 02:30 GMT

ఎంఐఎం పార్టీ అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ.. అస‌దుద్దీన్ ఒవైసీ పార్ల‌మెంటు స‌భ్య‌త్వం ర‌ద్దు చేయాలంటూ.. ఉత్త‌రాదికి చెందిన రెండు మూడు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వీటిలో బీజేపీ స‌భ్యులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా బీజేపీ నాయ‌కురాలు.. న‌వ‌నీత్ రాణా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఒవైసీ ఎంపీ స‌భ్య‌త్వాన్నిర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. ఆమె రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు లేఖ రాయడం సంచ‌ల‌నంగా మారింది. అదేవిధంగా యూపీకి చెందిన మ‌రో ఎంపీ కూడా.. దీనికి మ‌ద్ద‌తు ఇచ్చారు.

పార్ల‌మెంటులో ఇటీవ‌ల ఎంపీగా ప్ర‌మాణం చేసిన అస‌దుద్దీన్ ఒవైసీ.. ప్ర‌మాణ ప‌త్రం చ‌దువుతూ.. చివ‌రి లో `జై పాల‌స్తానా`.. జై తెలంగాణ‌.. అంటూ.. త‌న ప్ర‌మాణాన్ని ముగించారు. అయితే.. పాల‌స్తీనా వ్యాఖ్య‌ల పై అప్ప‌ట్లోనే బీజేపీ నాయ‌కులు మండిప‌డ్డారు. ఆయ‌న‌ను స‌భ‌లోకి అడుగు పెట్ట‌నివ్వ‌ద్దంటూ.. కొంద‌రు వ్యాఖ్యానించారు. మ‌రికొంద‌రు.. ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేసి.. పాల‌స్తీనాకు పంపించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం ఇప్పుడు ముసురుకుని.. రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు చేరింది. ఆమె ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.

Read more!

అయితే.. అస‌దుద్దీన్ వ్యాఖ్య‌లు ఇప్పుడు మాత్ర‌మే కొత్త‌కాదు. గ‌తంలోనూ ఆయ‌న అయోధ్య రామాల‌యం పైనా.. రామసేతు(త‌మిళ‌నాడు)పైనా వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రాముడు ఎవ‌రికి పుట్టాడో ఆధారాలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. రామ‌సేతును శాస్త్ర‌వేత్త‌లు నిరూపించ‌లేద‌ని.. అప్ప‌టి నాయ‌కులు ఒత్తిడి తెచ్చి.. నిరూపించుకున్నార‌ని వ్యాఖ్యానించారు. అయోధ్య రామమందిరం.. రాముడి కోసం.. నిర్మించ‌లేద‌న్న ఆయ‌న‌.. రాజ‌కీయం కోసం నిర్మించార‌ని.. ఇక‌, మూడోసారి బీజేపీ అధికారంలోకి వ‌స్తే.. రామమందిరం రాజ‌కీయ కేంద్రం అవుతుంద‌న్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై అప్ప‌ట్లోనూ వివాదం రాజుకుంది. అస‌దుద్దీన్‌నుదేశం నుంచి వెలివేయాలంటూ.. యూపీ లోని బీజేపీ ఎంపీలు.. ప్ర‌ధాని 2021లో రిప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. అయితే.. ఈ విష‌యాన్ని త‌ర్వాత కాలంలో అంద‌రూ మ‌రిచిపోయారు. ఇక‌, ఇప్పుడు జై పాల‌స్తీనా నినాదాలు చేయ‌డంతో మ‌రోసారి.. ఒవైసీపీ వివాదాల‌కు కేంద్రంగా మారార‌నే చ‌ర్చ సాగుతోంది. ఈ విష‌యంపై రాష్ట్ర‌ప‌తి ఆయ‌న‌ను వివ‌ర‌ణ కోరే అవ‌కాశం ఉంది. అంతేకానీ.. స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయక పోవ‌చ్చు.

Tags:    

Similar News