అసదుద్దీన్ ను గెలికిన ప్రియాంకాగాంధీ !

అయితే తాజాగా కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Update: 2024-05-10 14:18 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు వరకు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం ఉప్పు, నిప్పులా ఉండేవి. ఎన్నికల్లో రేవంత్ ఎంఐఎం మీద తీవ్రంగా ఆరోపణలు చేశాడు. ఎన్నికలయ్యాక రేవంత్, ఎంఐఎం కలిసిపోయారు.

అయితే తాజాగా కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రియాంకాగా గాంధీ మాట్లాడుతూ 'కీలక నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం, బీజేపీకి సహకరిస్తోందని’ ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ 'రాహుల్ గాంధీ 2019లో అమేథీ నియోజకవర్గంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయాడు. అమేథీలో స్మృతీ ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయినప్పుడు ఆ నియోజకవర్గంలో తన పార్టీ కానీ, తాను కానీ పోటీ చేయలేదు' అని ఓవైసీ ఎత్తి చూపాడు.

" ప్రియాంకా గాంధీ వాద్రా, మీ అన్న అమేథీలో ఓడిపోయారు. నేను వచ్చి అక్కడ పోరాడానా..? మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేతో మీకు పొత్తు ఉంది. అతను లౌకికవాదా..? ఇదే శివసేన కార్యకర్తలు డిసెంబర్ 6న బాబ్రీని ధ్వంసం చేశారు. మీరు వారితో ఉన్నారు" అని అసదుద్దీన్ అన్నారు.

మీరు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో పొత్తు పెట్టుకున్నారు. ఇదే ఆప్ జమ్మూ కాశ్మీ్ర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడంలో బీజేపీకి సాయం చేసింది. మీరు మమ్మల్ని బీజేపీ B-టీమ్ అని పిలుస్తారా..? అని అసద్ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో మీరు బీజేపీపై పోటీ చేసి 92 శాతం స్థానాల్లో ఓడిపోయారు. ఈ సారి 300 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, ఈ సారి ఎన్ని గెలుస్తారో చెప్పండి అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో వేచిచూడాలి.

Tags:    

Similar News