"రామయణం"తో హాస్యం... ఐఐటీc విద్యార్థులకు భారీ ఫైన్!
రామయణాన్ని అపహాస్యం చేసేలా వారి స్కిట్ ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇటీవల కాలంలో సున్నితమైన మత విశ్వాసాలపైనా, మతాలకు సంబంధించిన అంశాలపైనా హాస్యం చేయడం, కామెంట్లు చేయడం ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఐఐటీ బాంబేలో కొంతమంది విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. రామయణాన్ని అపహాస్యం చేసేలా వారి స్కిట్ ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో వారికి బిగ్ షాకిచ్చింది యాజమాన్యం.
అవును... ఐఐటీ బాంబేలో కొంతమంది విద్యార్థులు ఒక స్కిట్ ప్రదర్శించారు. ఇందుకోసం రామాయణాన్ని అపహాస్యం చేసేలా ఈ నాటకాన్ని ప్రదర్శించారు. దీంతో... యాజమాన్యం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. వారిపై చర్యలకు ఉప్రక్రమించింది. ఇందులో భాగంగా... ఒక్కో విద్యార్థికీ రూ.1.20 లక్షల చొప్పున జరిమానా విధించింది.
పూర్తి వివరాళ్లోకి వెళ్తే... ఈ ఏడాది మార్చిలో ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఇందులో కొంతమంది విద్యార్థులు "రాహోవన్" అనే పేరుతో ఒక నాటకాన్ని ప్రదర్శించారు. "రామాయణ" ఇతిహాసం ఇతివృత్తంగా ఈ స్కిట్ వేశారు. అందులో రాముడు, సీత, లక్ష్మణుడి పేర్లు నేరుగా ఉపయోగించనప్పటికీ... అరణ్యవాసంలోని కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలను ప్రదర్శించారట!
దీంతో... వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ స్కిట్ లో సదరు విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఐఐటీ బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ ఘటనపై క్రమశిక్షణా కమిటీని వేసి దర్యాప్తు జరిపింది. అనంతరం ఈ స్కిట్ వేసిన విద్యార్థులపై చర్యలు తీసుకుంది.
ఇందులో భాగంగా... ఈ స్కిట్ ప్రదర్శించిన సీనియర్ విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ.1.2 లక్షలు చొప్పున.. జూనియర్లకు రూ.40 వేలు చొప్పున జరిమానా విధించింది. ఇదే సమయంలో ఈ విద్యార్థులు జింఖానా అవార్డులు తీసుకునేందుకు అనర్హులని తెలిపింది. ఇదే సమయంలో జూనియర్లు హాస్టల్ సదుపాయాలు పొందడంపైనా నిషేధం విధించింది. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.