హస్తం వర్సెస్ కమలం... ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాల వివరాలివే!

అవును... ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడ్డాయి

Update: 2023-11-30 15:31 GMT

ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వడంతో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల సందడి మొదలైంది. ఇందులో ఇప్పటికే తెలంగాణలో పరిస్థితిపై పలు రకాల ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ కు అవకాశం ఉందని చెబుతుండగా... రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌, మిజోరం లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఆ ఫలితాల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

అవును... ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా... మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొందని తెలుస్తుంది. వీటిలో రాజస్థాన్‌ లో ఈసారి బీజేపీ అధికారాన్ని సంపాదించబోతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయగా.. ఛత్తీస్‌ గఢ్‌ లో మరోసారి కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి రానున్నట్లు చెబుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్‌ లో బీజేపీ - కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ తప్పదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి.

ఛత్తీస్‌ గఢ్‌ లో కాంగ్రెస్ హవా!:

ఛత్తీస్‌ గఢ్‌ లో మళ్లీ కాంగ్రెస్ పా ర్టీకే ఓటర్లు పట్టం కట్టనున్నారని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. 90 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మళ్లీ అధికారం రావొచ్చని అంచనా వేశాయి. వివిధ సంస్థలు ఇచ్చిన ఈ ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.!

జన్ కీ బాత్: కాంగ్రెస్ 42 - 53; బీజేపీ 34 - 45; ఇతరులు 0 - 3

పీపుల్స్ పల్స్: కాంగ్రెస్ 54 - 64; బీజేపీ 29 - 39; ఇతరులు 0 - 2

ఇండియా టీవీ - సీ.ఎన్.ఎక్స్: కాంగ్రెస్ 46 - 56; బీజేపీ 30 - 40; ఇతరులు 3 - 5

సీ ఓటర్: కాంగ్రెస్ 41 - 53; బీజేపీ 36 - 48; ఇతరులు 0 – 4

రాజస్థాన్‌ లో కమల వికాసం!:

రాజస్థాన్‌ లో 200 స్థానాలకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరగగా.. అధికారం చేపట్టాలంటే 100 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు బీజేపీకి అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి.

జన్ కీ బాత్: కాంగ్రెస్ 62 - 85; బీజేపీ 100 - 112; ఇతరులు 14 - 15

పీపుల్స్ పల్స్: కాంగ్రెస్ 73 - 95; బీజేపీ 95 - 115; ఇతరులు 8 - 21

టైంస్ నౌ - ఈటీజీ: కాంగ్రెస్ 56 - 72; బీజేపీ 108 - 128; ఇతరులు 0

పోల్ స్ట్రాట్: కాంగ్రెస్ 90 - 100; బీజేపీ 100 - 110; ఇతరులు 5 – 15

మధ్యప్రదేశ్ లో హోరా హోరీ!:

మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు ఎన్నికలు జరగగా... ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 116 స్థానాల్లో గెలుపొందాలి. ఈ క్రమంలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు మాత్రం ఏ ఒక్క పార్టీకి పట్టం కట్టలేదు.

జన్ కీ బాత్: కాంగ్రెస్ 102 - 125; బీజేపీ 100 - 123; ఇతరులు 0 - 5

పీపుల్స్ పల్స్: కాంగ్రెస్ 117 - 139; బీజేపీ 91 - 113; ఇతరులు 0 - 8

రిపబ్లిక్ టీవీ: కాంగ్రెస్ 97 - 107; బీజేపీ 118 - 130; ఇతరులు 0 - 2

పోల్ స్ట్రాట్: కాంగ్రెస్ 111 - 121; బీజేపీ 106 - 116; ఇతరులు 0

మిజోరంలో త్రిముఖ పోరు!:

మిజోరంలో 40 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నామమాత్రపు పెర్ఫార్మెన్స్ ని కబరిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఫలితంగా... మిజోరంలోని త్రిముఖ పోరు ప్రధానంగా మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎం.ఎన్.ఎఫ్.), కాంగ్రెస్‌, జోరం పీపుల్స్‌ మూమెంట్ (జెడ్.పీ.ఎం) మధ్యే పోటీ ఉండనుంది!

జన్ కీ బాత్: ఎం.ఎన్.ఎఫ్. 10 - 14; జెడ్.పీ.ఎం 15 - 25; కాంగ్రెస్ 5 - 9; బీజేపీ 0 - 2

ఇండియా టీవీ - సీ.ఎన్.ఎక్స్: ఎం.ఎన్.ఎఫ్. 14 - 18; జెడ్.పీ.ఎం 12 - 16; కాంగ్రెస్ 8 - 10; బీజేపీ 0-2

ఏబీపీ - సీఓటర్: ఎం.ఎన్.ఎఫ్. 15 - 21; జెడ్.పీ.ఎం 12 - 18; కాంగ్రెస్ 2 - 8; బీజేపీ 0

తెలంగాణలో కాంగ్రెస్ కు ఛాన్స్!:

తాజాగా ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇదే సమయంలో కొన్ని ఫలితాలు మాత్రం... హంగ్ సర్కార్ అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నాయి.

జన్ కీ బాత్: బీఆరెస్స్ 40 - 55; కాంగ్రెస్ 48 - 64; బీజేపీ: 7 - 13 ఎంఐఎం: 4 – 7

పోల్ స్టార్ట్: బీఆరెస్స్ 48 - 58; కాంగ్రెస్ 49 - 56; బీజేపీ 5 - 10; ఎంఐఎం: 6 – 7

సీ.ఎన్.ఎక్స్: బీఆరెస్స్ 48; కాంగ్రెస్ 60; బీజేపీ 5; ఎంఐఎం 6

పీటీఎస్ గ్రూప్: బీఆరెస్స్ 35 - 40 (+/-5); కాంగ్రెస్ 65 - 68 (+/-5); బీజేపీ 7 - 10 (+/-3); ఎంఐఎం 6 - 7; ఇతరులు: 1 - 2

Tags:    

Similar News