చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడి పై దాడి!... అసలేం జరిగింది?
అవును... చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలో రంగరాజన్ నివాసానికి కొంతమంది వ్యక్తులు వచ్చినట్లు సౌందర్య రాజన్ వివరించారు.
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రదానార్చకులు రంగరాజన్ పై దాడి జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. తన కుమారుడు పైన దుండగులు దాడి చేసినట్లు సౌందర్య రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా... గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ సమీపంలోని అర్చకుల ఇంట్లోకి చొరబడి రంగరాజన్ పై దాడి చేసినట్లు తెలిపారు.
అవును... చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలో రంగరాజన్ నివాసానికి కొంతమంది వ్యక్తులు వచ్చినట్లు సౌందర్య రాజన్ వివరించారు. ఈ సందర్భంగా రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అయితే.. ఆ సమయంలో దురుసుగా వ్యవహరించారని.. వారి మాట కాదన్నందుకు ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు.
ఈ సందర్భంగా.. ఈ దాడికి పాల్పడినవారితో పాటుగా పరోక్షంగా దీనికి కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో.. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారని తెలుస్తోంది. అసలు.. ఈ ఘటనకు కారణం ఏమిటనే విషయంపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం రంగరాజన్ బాగానే ఉన్నారని.. ఆలయ విధులు నిర్వర్తిస్తున్నారని చెబుతున్నారు.
మరోపక్క చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజన్ పై దాడి ఘటనను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎందరికో ధర్మ మార్గం చూపించి, హిందు ధర్మ పరిరక్షణకు కృషి చేస్తోన్న రంగరాజన్ పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.