నడిచివెళ్తే 42 ని కారులో 44 ని అట్టుంటాది బెంగళూరుతోనీ..!
ఈ సమయంలో బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితికి అద్దంపడుతూ ఓ పిక్ వైరల్ గా మారింది.
భారతదేశంలో పలు సిటీస్ లో ట్రాఫిక్ కే స్థాయిలో ఎంటుందనేది తెలిసిన విషయమే. మౌలిక సదుపాయాల విషయంలో పాలకులను అవగాహన కొరవడటం, విజన్ లేకపోవడం వంటివి వీటికి ప్రధాన కారణాలు అని చెబుతుంటారు. ఇదే సమయంలో ప్రజలకు ట్రాఫిక్ సెన్స్ లేకపోవడం కూడా మరో కారణం అని అంటుంటారు. ఈ సమయంలో బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితికి అద్దంపడుతూ ఓ పిక్ వైరల్ గా మారింది.
అవును... హైదరాబాదీలకు ప్రైమ్ టైమ్ లోనూ, వర్షాలు వచ్చినప్పుడూ ట్రాఫిక్ అలా ఉంటుందనేది చాలా బాగా తెలుసు! అయితే బెంగళూరులో అంతకు మించి అనే మాటలు నిత్యం వినిపిస్తుంటాయి. ఈ సమయంలో... ఆ మాటలకు మరింత బలం చేకూర్చుతూ, గూగుల్ సాక్ష్యాలతో ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదనే భావించొచ్చు!
వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి అక్కడున్న వారు కథలు కథలుగా చెబుతుంటారు. ఈ సమయంలో... అక్కడి ప్రయాణికుల అవస్థలను వెల్లడిస్తూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా... బెంగళూరులోని బీ గ్రేడ్ మెట్రోపాలిస్ గరుడాచార్ పాళ్య నుంచి కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ వరకూ ప్రయాణించడానికి 7 కిలోమీటల దూరం ఉంటుంది.
ఈ 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గూగుల్ మ్యాప్ ను ఆశ్రయిస్తే... అందులో కారులో 44 నిమిషాలు పడుతుందని గూగుల్ మ్యాప్ తెలిపింది. అదే పెద్ద షాకింగ్ విషయం అనుకునేలోపు... కాలినడక వెళ్తే 42 నిమిషాల్లో చేరుకోవచ్చని అదే గూగుల్ మ్యాప్ వెల్లడించింది. దీనికి సంబంధించిన మ్యాప్ స్క్రీన్ షాట్ ని ఓ వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో... ఢిల్లీ, ముంబై, పూణె, కోల్ కతా, హైదరాబాద్ లకు చెందిన పలువురు నెటిజన్లు తమ తమ అనుభవాలను పంచుకుంటున్నారు.