నిన్న అమెరికా, నేడు ఆస్ట్రేలియా.. స్టూడెంట్స్ వీసాలు రద్దు!

ఉన్నత చదువులు చదువుకుంటూ.. ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని భావించిన విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం అమెరికాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2025-02-07 09:48 GMT

ఉన్నత చదువులు చదువుకుంటూ.. ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని భావించిన విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం అమెరికాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పార్ట్ టైం జాబ్స్ విషయంలో రుల్స్ అతిక్రమిస్తే.. చిన్న చితకా శిక్షలు కాదు ఏకంగా దేశ భహిష్కరణ చేస్తుంది అమెరికా! ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ ఇదే తరహా ట్రీట్ మెంట్ మొదలైందని అంటున్నారు!

అవును... అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఇమ్మిగ్రేషన్స్ పై తన వైఖరిని స్పష్టంగా తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో... భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు పెరిగాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బహిష్కరణ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది విద్యార్థులు తమ పార్ట్ టైమ్ ఉద్యోగాలను వదులుకుంటున్నారని అంటున్నారు.

విదేశీ విద్యార్థుల పార్ట్ టైమ్ జాబ్స్ విషయంలో అమెరికాలో చాలా నిబంధనలు ఉంటాయి. ఇందులో భాగంగా.. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్ర్థులు క్యాంపస్ లో మాత్రమే వారానికి 20 గంటలు పని చేసే అవకాశం లభిస్తుంది. అయితే... చాలా మంది రోజువారీ ఖర్చుల కోసం బయట పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు. దీంతో.. ఇప్పుడు వారు దొరికితే వెనక్కి పంపేస్తున్నారని అంటున్నారు!

ఈ సమయంలో తాజాగా ఆస్ట్రేలియాకు వెళ్లిన స్టూడెంట్స్ కూడా పరిమితికి మించి పార్ట్ టైం జాబ్స్ చేసి ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఏకంగా వారి వీసాలు రద్దవుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన నోటీసులను ఎక్స్ లో షేర్ చేస్తున్నారు. దీంతో... నిన్న అమెరికాలో ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా మొదలైపోయిందనే చర్చ తెరపైకి వచ్చింది.!

వాస్తవానికి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన విదేశీ విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. అయితే.. 15 రోజుల్లో 48 గంటలు మాత్రమే వారు పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవాలి. అది రెగ్యులర్ రోజుల్లో అయినా.. హాలిడేస్ లో అయినా మారదని అంటున్నారు. అయితే పలువురు విద్యార్థులు వారం రోజుల్లోనే 40 గంటల వరకూ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారంట.

ఇలా నిబంధనలకు విరుద్ధంగా తమ దేశంలో పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న విదేశీ విద్యార్థులను గుర్తించి, వారి వీసాలను రద్దు చేస్తోందంట ఆస్ట్రేలియా ప్రభుత్వం.

Tags:    

Similar News