ఆస్ట్రేలియాలో బెంగళూరు మహిళ హత్య.. ఆచూకీ చెబితే రూ.5.5కోట్లు
ఇంతకీ బెంగళూరు మహిళ ఆస్ట్రేలియాలో ఎలా హత్యకు గురయ్యారన్న విషయంల్లోకి వెళితే.. పదేళ్ల క్రితం (2015 మార్చి 7న) బెంగళూరుకు చెందిన ప్రభా అరుణ్ కుమార్ మైండ్ ట్రీ కంపెనీలో పని చేస్తున్నారు.
పదేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన ఒక మహిళ హత్య ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. నేరాలు తక్కువగా జరిగే దేశంలో చోటు చేసుకున్న ఈ దారుణ హత్యతో అక్కడి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. హత్య జరిగి దశాబ్దం గడిచిపోతున్నప్పటికి నిందితుడి ఆచూకీని తేల్చే విషయంలో ఆస్ట్రేలియా పోలీసులు ఏమీ తేల్చకపోవటంతో తాజాగా వారు కీలక ప్రకటన చేశారు. హత్య చేసిన హంతకుడి వివరాలు.. ఆచూకీ తెలిపితే మిలియన్ డాలర్ల బహుమతిని ఇస్తామని ప్రకటించారు.
మన రూపాయిల్లో ఇది రూ.5.57కోట్లతో సమానం. ఇంతకీ బెంగళూరు మహిళ ఆస్ట్రేలియాలో ఎలా హత్యకు గురయ్యారన్న విషయంల్లోకి వెళితే.. పదేళ్ల క్రితం (2015 మార్చి 7న) బెంగళూరుకు చెందిన ప్రభా అరుణ్ కుమార్ మైండ్ ట్రీ కంపెనీలో పని చేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఆన్ సైట్ విజిట్ కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న ఆమె.. బెంగళూరులోని భర్తతో ఫోన్ లో మాట్లాడుతూ వస్తున్నారు.
తనను ఎవరో వెంబడిస్తున్నట్లుగా పేర్కొన్న ఆమె.. తర్వాత ఫోన్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇంటికి 300 మీటర్ల దూరంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆమె గొంతులో కత్తితో పొడిచి చంపేశారు. ఆమెను ఎవరు వెంబడించారు? హత్య చేసింది ఎవరు? అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారం దొరకలేదు.
దీంతో.. ఆమె మరణాన్ని సీరియస గా తీసుకున్న న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం నిందితుడి ఆచూకీ చెబితే మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించారు. మరి.. ఇప్పటికైనా ఈ మర్డర్ మిస్టరీ తేలుతుందేమో చూడాలి.