జ‌గ‌న్ ద‌గ్గ‌ర అవినాష్ ప‌ట్టుకు ఇంత‌క‌న్నా ఫ్రూప్స్ కావాలా...!

ఇక‌, స్తానికంగా కూడా నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌తోనూ ఆయ‌న మ‌మేక‌మ‌వుతున్నారు. కొండ ప్రాంత వాసుల‌కు ప‌ట్టాలు ఇప్పించ‌డంతోపాటు.. తాగునీటి సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించారు.

Update: 2023-12-15 15:30 GMT

తొలి అడుగులోనే ప‌ట్టు సాధించ‌డం అంటే మాట‌లు కాదు. పైగా.. అతి పెద్ద వైసీపీలో ప‌ట్టు పెంచుకోవ‌డం.. త‌న అనుకున్న‌వారికి ప‌ద‌వులు ద‌క్కేలా చక్రం తిప్ప‌డం వంటివి చూస్తే.. యువ నేత‌గా ఆయ‌న దూకుడు అర్థ‌మ‌వుతుంది. ఆయ‌నే విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీకి రెడీ అయిన దేవినేని అవినాష్‌. దాదాపు మూడేళ్ల కింద‌టే ఆయ‌న అభ్య‌ర్థిత్వం ఖ‌రారైంది.

ఇక‌, స్తానికంగా కూడా నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌తోనూ ఆయ‌న మ‌మేక‌మ‌వుతున్నారు. కొండ ప్రాంత వాసుల‌కు ప‌ట్టాలు ఇప్పించ‌డంతోపాటు.. తాగునీటి సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించారు. ఇక‌, పార్టీలోనూ యువ నేత‌గా ప‌ట్టు బిగిస్తున్నారు. విజ‌య‌వాడ స‌హా గుంటూరు ప‌రిస‌రాల్లో సీఎం జ‌గ‌న్ పాల్గొనే కార్య‌క్ర‌మాల‌కు కూడా.. దేవినేని అవినాష్ హాజ‌ర‌వుతూ.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నారు. ఇలా.. ఆయ‌న ఇటు పార్టీలోనూ అటు ప్ర‌జ‌ల‌తోనూ క‌లిసిపోయి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సీఎంవోలోనూ అవినాష్ ప‌నులు, ఫైల్స్ చ‌క‌చ‌కా క‌దులుతున్నాయి. జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కావాల‌న్నా అవినాష్‌కు మంత్రులు, ఎమ్మెల్యేల కంటే స్పీడ్‌గా దొరుకుతోంది.

ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన వైసీపీ యువజ‌న విభాగం ఏర్పాటు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిలో నూ అవినాష్ త‌న‌దైన ముద్ర చూపించారు. తొలి అడుగులోనే ఈ క‌మిటీలో త‌న వారికి చోటు ద‌క్కేలా చేశా రు. ఒక్క ప‌ద‌వి ద‌క్కించుకునేందుకే వైసీపీలో పోటా పోటీ వాతావ‌ర‌ణం ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు ఏకంగా.. నాలుగు ప‌ద‌వులు ద‌క్కించుకుని.. త‌న స‌త్తా చాటుకున్నారు దేవినేని అవినాష్‌. పార్టీలో త‌న‌కు న్న ప‌ట్టును కూడా ఆయ‌న నిరూపించుకున్న‌ట్టు అయింద‌ని స్థానికంగా చ‌ర్చ సాగుతోంది.

వైసీపీ విద్యార్థి, యువ‌జ‌న విభాగం రాష్ట్ర క‌మిటీలో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన దండ‌మూడి రాజేష్ (ఉపాద్య‌క్షుడు), గునుపూడి చందు(కార్య‌ద‌ర్శి), మ‌ద్దూరి శ్యామ్‌(సంయుక్త కార్య‌ద‌ర్శి)ల‌ను నియ‌మించారు. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ ఆమోద ముద్ర వేశారు. వాస్త‌వానికి ఎంతో పోటీ ఉన్న‌ప్ప‌టికీ.. దేవినేని అవినాష్ చొర‌వ‌, సీఎం జ‌గ‌న్ జోక్యంతో ఆయా ప‌ద‌వులు ద‌క్క‌డం విశేషం.

Tags:    

Similar News