కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి జగన్ షాక్ !?

కడప నుంచి ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ ఎంపీ కావాలని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరాటపడుతున్నారు.

Update: 2024-04-11 07:49 GMT

కడప నుంచి ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ ఎంపీ కావాలని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరాటపడుతున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపుగా నాలుగు లక్షల ఓట్లకు దరిదాపులలో మెజారిటీ తెచ్చుకుని గ్రాండ్ సక్సెస్ కొట్టిన అవినాష్ రెడ్డి ఈసారి కూడా తనదే విజయం అని నమ్మకంగా ఉన్నారు. మరో వైపు వైఎస్ జగన్ కూడా ఆయనకు టికెట్ ఇచ్చేశారు.

కడప ఎంపీ అభ్యర్థి విషయంలో మార్పు ఉంటుందని గతంలో వార్తలు వినిపించాయి. దానికి కారణం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి హస్తం ఉందంటూ ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. దీని మీద సీబీఐ విచారణ చేస్తోంది. ప్రస్తుతం ముందస్తు బెయిల్ మీద అవినాష్ రెడ్డి ఉన్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో అవినాష్ రెడ్డికి ఎంపీ అభ్యర్ధిత్వం ప్రకటిస్తే వ్యతిరేకత వస్తుందని అప్పట్లో వైసీపీలో అనుకున్నారు. ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదని కూడా గతంలో అనేకసార్లు ప్రచారం సాగింది. మొత్తం మీద చూస్తే అవినాష్ రెడ్డికే టికెట్ ఇస్తూ వైఎస్ జగన్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. దాని పర్యవసానాలు ఫలితాల తరువాత ఎలా ఉంటాయో అనుకుంటూండగా జగన్ సొంత చెల్లెలు షర్మిల కడప నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు

ఆమె ఏకంగా వైఎస్ అవినాష్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. హంతకులకు టికెట్లు ఎలా ఇస్తారు అంటూ ఆమె జగన్ మీదనే విమర్శలు గుప్పించారు. హంతకుల పాలన పోవాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ హస్తం ఉందని షర్మిల తో పాటు వివేకా కుమార్తె సునీత కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో వైసీపీకి ఇబ్బందులు వస్తాయని అంతా ఆలోచిస్తున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసు సున్నితమైనది. ఇది కోర్టులో ఉంది. కానీ ఆరోపణలతో పాటు అన్ని వేళ్ళూ వైఎస్ అవినాష్ రెడ్డి వైపు చూపిస్తూండడం ఆయనకు మద్దతుగా జగన్ ఉన్నారని ప్రచారం చేయడంతో అసలుకే ఎసరు వస్తోందని వైసీపీలో ఇపుడు అంతర్మధనం సాగుతోంది అని అంటున్నారు.

దాంతో వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అని ప్రచారం సాగుతోంది. అంతే కాదు వైఎస్ కడప ఎంపీ వైసీపీ అభ్యర్ధిగా అవినాష్ రెడ్డిని మార్చేయాలని కూడా డిసైడ్ అయ్యారని అంటున్నారు. అదే కనుక జరిగితే పెను సంచలనమే అని అంటున్నారు. మరి అవినాష్ రెడ్డి ప్లేస్ లో ఎవరిని నియమిస్తున్నారు అంటే అభిషేక్ రెడ్డి పేరు వినిపిస్తోంది.

ఈయన వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడు అవుతారు. వైద్యుడిగా ఉన్నత విద్యావంతుడిగా అభిషేక్ రెడ్డికి మంచి పేరు ఉంది. ఆయన కడపలో సుపరితుడు. 2019 ఎన్నికల్లో పులివెందులలో జగన్ విజయం కోసం బాగా తిరిగి ప్రచారం చేసారు. వైఎస్ ప్రకాష్ రెడ్డికి పెద్ద మనిషిగా పేరుంది. ఆయన మొత్తం వైఎస్సార్ వంశ వృక్షంలో పెద్దాయనగా చెప్పుకుంటారు. జగన్ ఎపుడు పులివెందుల వచ్చినా ఆయనతో భేటీ అవుతారు. ఆ కుటుంబానికి ఎంతో విలువ గౌరవం ఇస్తూంటారు. ఇపుడు అభిషేక్ రెడ్డి వంటి యువకుడిని కడప ఎంపీ సీటులో వైసీపీ తరఫున బరిలోకి దించడం ద్వారా వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసింది అని అంటున్నారు

ఈ దెబ్బతో షర్మిలకు ఎటువంటి ప్రచార అస్త్రం లేకుండా చేయాలన్నదే ఆ వ్యూహం అని అంటున్నారు. కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న షర్మిల కేవలం వైఎస్ వివేకా హత్య అంశాన్నే ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ విధంగా వచ్చే సానుభూతితో గెలవాలని చూస్తున్నారు. దాంతో వైసీపీ కనుక అభిషేక్ రెడ్డికి చాన్స్ ఇస్తే మొదటికే కట్ చేసి షర్మిల ఆశలకు చెక్ పెట్టినట్లు అవుతుంది అని అంటున్నారు. తొందరలోనే దీని మీద వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News