కాఫీ షాప్ వాష్ రూమ్ లో కెమెరా... ఎలా ఫిక్స్ చేశాడో తెలుసా?

ఈ క్రమలో తాజాగా ఓ వ్యక్తి కాఫీ షాపులోని వాష్ రూమ్ లో సీక్రెట్ గా ఓ కెమెరా ఏర్పాటు చేశాడు.

Update: 2024-08-11 11:50 GMT

మహిళలు వస్త్ర దుకాణాల్లో దుస్తులు ట్రైల్ చేసుకునే రూమ్స్ లోనూ, మాల్స్ లోని వాష్ రూమ్స్ లోనూ, పబ్స్ వాష్ రూమ్స్ ల్లోని టాప్ ప్లేస్ లోనూ రహస్య కెమెరాలు ఫిక్స్ చేస్తూ కొంతమంది నీచమైన పనులకు పాల్పడుతున్నట్లు ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమలో తాజాగా ఓ వ్యక్తి కాఫీ షాపులోని వాష్ రూమ్ లో సీక్రెట్ గా ఓ కెమెరా ఏర్పాటు చేశాడు.


అవును... బెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ షాపులోని లేడీస్ వాష్ రుమ్ లో ఓ కెమెరాను ఫిక్స్ చేశాడు ఓ వ్యక్తి. ఇందులో భాగంగా ఆ వాష్ రూమ్ లోని చెత్తబుట్టలో సెల్ ఫోన్ ని ఉంచాడు. ఈ సమయంలో ఆ ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో ఉంచి కెమెరా మాత్రం ఆన్ చేసి పెట్టాడు. అయితే... ఓ మహిళ చెత్త బుట్టలో కెమెరా ఉండటాన్ని గమనించింది.. వెంటనే యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.

దీంతో ఈ వ్యవహారంపై సదరు కాఫీ షాపు స్పందించింది. ఇందులో భాగంగా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. తమ ఔట్ లెట్ లలో ఇలాంటి దుశ్చర్యలను ఏమాత్రం సహించేది లేదని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో ఆ ఫోన్ ఎవరదనే విషయంపై ఆరా తీయగా ఆ కాఫీ షాప్ లో పనిచేస్తున్న వ్యక్తిదే అని తెలిసింది. దీంతో అతడిని ఉద్యోగంలో నుంచి తీసేసినట్లు యాజమాన్యం వెల్లడించింది.

అయితే ఆ కెమెరా సుమారు రెండు గంటల నుంచి రికార్డింగ్ మోడ్ లో ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది. ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి చెత్తబుట్టలోని ఓ సంచిలో చాలా జాగ్రత్తగా అమర్చినట్లు సదరు మహిళ తెలిపారు. ఈ సమయంలో కెమెరాకు ఏమీ అడ్డురాకుండా... సంచికి చిన్న రంద్రం చేసి, సరిగ్గా టాయిలెట్ సీట్ దిశగా ఉంచారని చెబుతున్నారు.

ఈ సమయంలో కాఫీ షాపు వద్దకు చేరుకున్న పోలీసులు ఈ ఆరోపణలు ధృవీకరించారు. సదరు ఉద్యోగిని అరెస్ట్ చేశారు. అతని మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడు భద్రావతి నివాసి అని, అతడు కొంతకాలంగా ఈ కాఫీ షాపులోనే పని చేస్తున్నాడని తెలిపారు. ఈ వ్యవహారాన్ని గ్యాంగ్స్ ఆఫ్ సినీపుర్ పేరిట ఉన్న ఇన్ స్టాగ్రామ్ హ్యాండ్ లో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News