ఏపీ స్పీకర్‌ గా అయ్యన్నపాత్రుడు నామినేషన్‌!

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Update: 2024-06-21 10:02 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ 175 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తొలుత సీఎం చంద్రబాబు, అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ప్రమాణం చేశారు. ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో 175 మంది ఎమ్మెల్యేలతోనూ పోటెం స్పీకర్, సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ఆయనతో నిన్న గవర్నర్.. ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేయించారు. ఆ సంగతి అలా ఉంటే... శుక్రవారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం స్పీకర్ పదవులకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.

అవును... ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లను ఎన్నుకునే ప్రక్రియ మొదలవుతుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ గా టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్‌ వేశారు. ఈ మేరకు అయ్యన్న తరపున కూటమి నేతలు నామినేషన్‌ సమర్పించారు.

ఇందులో భాగంగా... అయ్యన్నపాత్రుడి తరుపున కూటమి మంత్రులు పవన్‌ కల్యాణ్, నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యప్రకాశ్ లు పాల్గొన్నారు. మరోపక్క డిప్యుటీ స్పీకర్ పోస్ట్ జనసేన లేదంటే.. బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగాణాలు వినిపించినప్పటికీ... ఆ పోస్ట్ కూడా టీడీపీనే దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News