ఆజంఖాన్ టైం అస్సలు బాగోలేదు.. ఆ కేసులు ఏడేళ్లు జైలు శిక్ష
ఇదిలా ఉంటే తాజాగా ఆయనపై ఉన్నతప్పుడు పుట్టిన రోజు ధ్రువపత్రాలకు సంబంధించిన కేసులో ఆయన నేరం నిరూపితం కావటమే కాదు.. ఆయనతో పాటు ఆయన సతీమణి.. కుమారుడ్ని దోషిగా గుర్తిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ముందు వెనుకా చూసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడే నేతల్లో యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ఒకరు. ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు అందరికి తెలిసిందే. తరచూ ఏదో ఒక వివాదంలో ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆయనపై ఆరోపణలకు.. కేసులకు కొదవ లేదు. తరచూ ఏదో ఒక ఉదంతంలో ఆయన వేలు పెట్టటం తెలిసిందే. కొన్నేళ్ల వరకు ఆయన ప్రభ ఎంతలా వెలిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆయనకు గడ్డు రోజులు మొదలయ్యాయి.
ఆయనతోపాటు ఆయన కొడుకు కూడా జైల్లో ఉంటున్న పరిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా ఆయనపై ఉన్నతప్పుడు పుట్టిన రోజు ధ్రువపత్రాలకు సంబంధించిన కేసులో ఆయన నేరం నిరూపితం కావటమే కాదు.. ఆయనతో పాటు ఆయన సతీమణి.. కుమారుడ్ని దోషిగా గుర్తిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. తప్పుడు వివరాలతో పుట్టిన తేదీ ధ్రువపత్రాల్ని తీసుకున్న ఉదంతంలో ఆజంఖాన్ తో పాటు.. ఆయన సతీమణి తజీన్ ఫాతిమా.. చిన్నకొడుకు అబ్దుల్లా ఆజంలకు ఏడేళ్లు జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు.
కోర్టు తీర్పు అనంతరం వారిని రాంపుర్ జిల్లా జైలుకు తరలించారు.తనకున్న రాజకీయ పలుకుబడితో లక్నోలో ఒకటి.. రాంపురల్ లో ఒకటి చొప్పున బర్త్ సర్టిఫికేట్లను తీసుకున్నట్లుగా బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా చేసిన కంప్లైంట్ తో 2019లో కేసు నమోదైంది. అప్పటి నుంచి సాగిన కేసు.. తాజాగా తీర్పు వెలువడింది. ఏడేళ్ల జైలుతో ఆయన మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.
ఎంపీ.. ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో ఈ కేసును విచారించారు. ఈ కేసులో ముగ్గురికి ఏడేళ్ల జైలుతో పాటు.. ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున ఫైన్ విధిస్తూ తీర్పును ఇచ్చారు. అయితే.. ఆజంఖాన్ ను.. ఆయన కుటుంబాన్ని కావాలనే టార్గెట్ చేసినట్లుగా విపక్షలు ఆరోపిస్తున్నాయి.