అజారుద్ధీన్ రిటైర్డ్ హర్ట్?... కారణం ఇదే!

మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ అధికార పార్టీకి షాక్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Update: 2024-01-26 05:35 GMT

మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ అధికార పార్టీకి షాక్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... కాంగ్రెస్‌ కు రాజీనామా చేసే యోచనలో ఆయన ఉన్నట్లు తెలిస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిబెట్టుకుని ఉన్న అజారుద్దీన్.. పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆయన పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని అంటున్నారు.

అవును... మహ్మద్ అజారుద్దీన్ అధికార పార్టీకి షాక్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవల జరిగిన పరిణామాలతో హర్ట్ అయిన ఆయన... కాంగ్రెస్ పార్టీకి రాజినామా చేసే యోచనలో ఉన్నారని అంటున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆఖరి నిమిషంలో అజారుద్దీన్‌ కు జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చేతిలో స్వల్ప తేడాతో అజార్ ఓడిపోయారు.

అయితే ఆ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ... పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన ఆశించారని అంటున్నారు. అయితే... తానొకటి తలిస్తే రాజొకటి తలచాడన్నట్లుగా... అటు ఎమ్మెల్యే కోటాలోనూ, ఇటు గవర్నర్ కోటాలోనూ అజార్ పేరు లేదు.

దీంతో... ఆయన తీవ్రంగా హర్ట్ అయ్యారని.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ మేరకు ఆయన తన సన్నిహితుల వద్ద ఈ విషయాల గురించి చర్చిస్తున్నారని సమాచారం. ఈ క్రమ్మలో... టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా... టీం ఇండియా మాజీకెప్టెన్ గా సుపరిచితులైన అజారుద్ధీన్... 2009లో ఉత్తరప్రదేశ్‌ లో మొరదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందగా.. 2014లో రాజస్థాన్‌ లోని టోంక్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి పరాజయం చెందారు. ఆ తరువాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సీ.ఏ) అధ్యక్షుడిగా గెలుపొందారు.




Tags:    

Similar News