బాబు ప్లాన్స్ మీద పగ పట్టేసిందెవరు ?

దాంతో చంద్రబాబు ఆ విమర్శలకు చెక్ పెట్టాలని కూడా పట్టుదలగా ఉన్నారు.

Update: 2024-09-09 02:45 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగవ సారి ఏపీ సీఎం అయ్యారు. ఈసారి ఆయన అయిదేళ్ల కాలాన్ని చాలా విలువైనది గా భావిస్తున్నారు. ఒక్క రోజునూ వృధా చేయకుండా మొత్తం కాలాన్ని పూర్తిగా వాడుకుని ఏపీకి ఒక రూపు రేఖా ఇవ్వాలని దాని మీద తన ముద్ర బలంగా ఉండాలని తపన పడుతూ వచ్చారు.

ఏపీకి రాజధాని లేదని గత పదేళ్లుగా విమర్శలు ఉన్నాయి. అవి ఇంటా బయటా గట్టిగానే వినిపిస్తున్నాయి. దాంతో చంద్రబాబు ఆ విమర్శలకు చెక్ పెట్టాలని కూడా పట్టుదలగా ఉన్నారు. ఆయన తాను ఎన్నుకున్న అమరావతిని ఏపీకే కాదు దేశంలోనే ఒక రోల్ మోడల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలని భారీ డిజైన్లనే వేశారు.

దానికి అంతా అనుకూలిస్తున్న నేపథ్యం ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టింది. అయితే టీడీపీ ఎంపీల మద్దతుతో కావడం బాబుకు భారీ అడ్వాంటేజ్ గా మారింది. ఇక కేంద్రంలోని ప్రభుత్వం కూడా ఏపీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టక తప్పనిసరి పరిస్థితి అయింది.

మరో వైపు అమరావతి రాజధానికి గతంలో ప్రపంచ బ్యాంకుని రుణంగా అడిగితే కుదరలేదు. ఈసారి మాత్రం బాబు సీఎం అయిన వెంటనే చకచకా అంతా జరుగుతోంది. దానికి కేంద్రం ష్యూరిటీగా కూడా ఉండడంతో 15 వేల కోట్ల రూపాయలు అమరావతికి తరలి రానున్నాయి.

అన్నీ అనుకూలిస్తే అమరావతిలో ఈ అక్టోబర్ లోనే కీలక పనులకు శ్రీకారం చుట్టాలని కూడా బాబు ప్రభుత్వం తలపోసింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్టోబర్ మొదటి వారంలో ఏపీకి వస్తారు అని ప్రచారం సాగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనులను కూడా సాధ్యమైనత వేగంగా పూర్తి చేయాలని కూడా బాబు ఆలోచిస్తున్నారు.

అయితే అనుకోని విపత్తుగా వరదలు వచ్చి పడ్డాయి. అది కూడా కూటమి ప్రభుత్వం ఇంకా ఏమీ సర్దుకోకుండానే భయంకరమైన వరదలు రావడం, వరసపెట్టి అల్ప పీడనాలు వాయుగుండాలతో ఏపీ అంతా అతలాకుతలం అవుతోంది. బెజవాడ వరదతో పాటు ఏపీలో ఆగస్ట్ చివర నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకూ కురిసిన భారీ వానలు వరదల మీద ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తే అవి ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయలుగా లెక్క తేలింది.

ఇపుడు రెండవ విడత అన్నట్లుగా మరో ఉపద్రవం కి భారీ వాయుగుండం తయారైంది. ఈ ముప్పు వల్ల మళ్లీ ఏపీకి భారీ నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. మరి ఇది చేసే కీడు ఎంత ఈ నష్టం అంచనాలు ఎన్ని వేల కోట్లకు తేలతాయో అన్నది కూడా తెలియడం లేదు. ఇదే తీరుగా చూస్తే వేలాది కోట్ల నష్టంతో ఏపీ కునారిల్లుతుంటే వాటికి కేంద్రం ఎంత సాయం చేసినా ఏపీ కూడా తన ఖజానా నుంచి చిల్లు పెట్టుకుని ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.

మరో వైపు చూస్తే కేంద్ర సాయాన్ని ఈ విధంగా ఉదారంగా వాడుకుంటే ఇక కీలక ప్రాజెక్టులకు నిధులు ఏ విధంగా రాబట్టుకోగలుతారు. దానికి కేంద్రం కూడా ఏ విధంగా చొరవ తీసుకోగలదు అన్న చర్చ ఒక వైపు ఉండనే ఉంది. మరో వైపు చూస్తే ఈ ఏడాది చివరకు సరిపడా పనిని ఈ భారీ వరదలు కలిగించాయని అంటున్నారు.

రెండో వైపు ఏ మాత్రం తల తిప్పి చూడకుండా ఈ వానలు వరదలు మిగిలిచిన ప్రకృతి విపత్తు నుంచి ఏపీని కాపాడుకోవడానికే ప్రభుత్వం అత్యత్ధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అని అంటున్నారు. నిజానికి చూస్తే ఏపీలోని కోస్తా తీరానికి అక్టోబర్ నవంబర్ నెలలు భారీ ముప్పుని కలిస్తూ ఉంటాయి. ప్రతీ ఏటా ఆ సమయంలోనే వాయుగండాలు ఉంటాయి.దాని వల్ల వరదలతో పరిస్థితి దారుణంగా మారుతూ ఉంటుంది. ఈసారి మాత్రం ఆగస్ట్ నెల నుంచే ఆ ఉపద్రవం తోసుకొచ్చింది.

Tags:    

Similar News