వ‌ర‌ద 'సాయం'- బీజేపీ ఎత్తుగ‌డ‌కు బాబు బ‌లి.. !

దీంతో సుమారుగా 90 వేల కుటుంబాల‌ను 4 ల‌క్ష‌లకు పైగా జ‌నాలను ఆదుకోవాల్సిన బాధ్య‌త సీఎం చంద్ర‌బాబుపైనా కూట‌మి స‌ర్కారుపైనా ప‌డింది.

Update: 2024-10-07 03:00 GMT

'ఆప‌న్న ప్ర‌స‌న్నుండు.. మ‌న మోడీ!' - అంటూ ఇటీవ‌ల జ‌రిగిన హ‌రియాణా ఎన్నిక‌ల్లో బీజేపీ నేత‌లు ఆయ‌న‌ను ఆకాశం నుంచి అంత‌రిక్షం వ‌ర‌కు మోసేశారు. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకోవ‌డంలో మోడీని మించిన నాయ‌కుడు లేద‌న్న‌ది క‌మ‌ల నాథుల మాట‌. స‌రే.. ఏపీ విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఆ ఆప‌న్న హ‌స్తం ఏమైంద‌న్న‌దే ప్ర‌శ్న‌. ఇక్క‌డ విజ‌య‌వాడ స‌హా కాకినాడ‌, ఏలూరు, బాప‌ట్ల జిల్లాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకుని నానా తిప్పలు ప‌డిన విష‌యం తెలిసిందే.

దీంతో సుమారుగా 90 వేల కుటుంబాల‌ను 4 ల‌క్ష‌లకు పైగా జ‌నాలను ఆదుకోవాల్సిన బాధ్య‌త సీఎం చంద్ర‌బాబుపైనా కూట‌మి స‌ర్కారుపైనా ప‌డింది. ఈ క్ర‌మంలోనే 6880 కోట్ల రూపాయ‌ల ప్రాథ‌మిక సాయం కావాలంటూ.. బాబు నివేదిక పంపించారు. కేంద్ర బృందానికి కూడా పూస గుచ్చిన‌ట్టు వివ‌రించారు. ఇదీ న‌ష్టం.. ఆదుకోక‌పోతే క‌ష్టం! అంటూ ఆయ‌న క‌రాకండీగా కూడా చెప్పేశారు. పైగా ఇక్క‌డా అక్క‌డా కూడా.. బీజేపీ కూట‌మిలో ఉన్న నేప‌థ్యంలో త‌న‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంద‌ని చంద్ర‌బాబు త‌ల‌పోశారు.

అయితే..ఈ సీన్ రివ‌ర్స్ అయింది. ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేనందున‌.. అస‌లు అవ‌స‌రం అయిపోయినందు న కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఎత్తుగ‌డ వేసింది. అడిగిన దానిలో 6880 కోట్లు అడిగితే.. 1430 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇక‌, అస‌లు పెద్ద‌గా న‌ష్ట‌పోని మ‌హారాష్ట్ర‌కు మాత్రం నిధుల వ‌ర‌ద‌ను పారించింది. దీనికి కార‌ణం.. అక్క‌డ ఎన్నిక‌లు ఉన్నాయి. వాటిలో విజ‌యం ద‌క్కించుకోవాలి! ఇదీ.. బీజేపీ ఎత్తుగ‌డ‌. అయితే.. ఏపీలో జ‌రిగిన న‌ష్టం తాలూకు క‌ష్టం ఎవ‌రికి? అంటే చంద్ర‌బాబుకే!

ఎందుకంటే.. బీజేపీ స్వయం ప్రకాశిత‌మేమీ కాదు. చంద్ర‌బాబు వెలుగులో క‌మ‌లం విరాజిల్లుతోంది. కాబ ట్టి జ‌నాగ్ర‌హం.. ఎలా ఉన్నా.. అంతిమంగా అది ప‌డేది బాబుపైనే. ఇప్పుడు అదే ప‌రిస్థితి నెల‌కొంది. బుడ‌మేరును ప‌టిష్టం చేస్తామ‌ని.. ప‌నులు కూడా ప్రారంభిస్తామ‌ని చెప్పిన మంత్రులు.. ఇప్పుడు ఆ ఊసే ఎత్త‌డం లేదు. దీనికి కార‌ణం.. నిధుల లేమి. కేంద్రం నుంచి వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న కోట్ల రూపాయ‌లు రాక‌పోవ‌డం. మొత్తంగా చూస్తే.. ఇక‌, వ‌చ్చేది ఏమీ లేదు. చేయాల్సింది కూడా లేదు. ఏదేమైనా.. క‌ష్టం వ‌స్తే.. మాత్రం బాబుకే చుట్టుకోనుంది.

Tags:    

Similar News