చంద్రబాబు కూడా ప్రమాణం చేయాలా ?

అయితే దానిని ఆచరణలో పెట్టింది మరో మాజీ చైర్మన్ అయిన భూమన కరుణాకరరెడ్డి.

Update: 2024-09-24 03:33 GMT

ఏపీలో సత్య ప్రమాణాలకు రంగం సిద్ధం అవుతోందా. తప్పు చేయని వారు శ్రీవారి ఆలయం వద్ద ప్రమాణం చేసి తీరాల్సిందే అని వైసీపీ అంటోంది. ఈ ప్రమాణాలకు తెర తీసింది మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అయితే దానిని ఆచరణలో పెట్టింది మరో మాజీ చైర్మన్ అయిన భూమన కరుణాకరరెడ్డి.

ఆయన ఏ మాత్రం ముందస్తు సమాచారం లేకుండా తిరుమలకు వచ్చారు. అఖండం వద్ద కర్పూర హారతి వెలిగించారు. స్వామి నేను ఏ తప్పు చేయలేదు అన్నారు. తప్పు ఒకవేళ చేస్తే నా కుటుంబం సర్వ నాశనం అవుతుందని కూడా చెప్పారు.

అదే సమయంలో తన మీద ఆరోపణలు చేసిన వారు కూడా సత్య ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతోనే ఇపుడు అందరి చూపూ చంద్రబాబు మీద పడుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల మీద ఆరోపణలు చేసింది చంద్రబాబు.

దానిని నిరూపించమని వైసీపీ అంటోంది. సీబీఐ విచారణ జరిపించమని కూడా డిమాండ్ చేస్తోంది. అలాగే సత్య ప్రమాణం చేయమని అంటోంది. అయితే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సిట్ ని నియమించారు. సిట్ దర్యాప్తులో నిజాలు అన్నీ వెలుగు చూస్తాయని ఆయన అంటున్నారు.

అదే సమయంలో భూమన సత్య ప్రమాణం చేసి కలకలం రేపారు. అంతే కాదు తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే జంకూ గొంకూ లేకుండా ప్రమాణం చేస్తున్నాను అని ప్రకటించారు. తన మీద తన కుటుంబం మీద ఆరోపణలు చేస్తున్న వారు ఇదే తీరున ప్రమాణం చేయగలరా అని ఆయన నిలదీస్తున్నారు. తప్పు జరిగింది లేదూ అన్నది శ్రీవారి సన్నిధానంలోనే తేల్చుకుందామని ఆయన అంటున్నారు. మొత్తానికి భూమన ప్రమాణంతో ఇష్యూ మరో వైపు మళ్ళుతోంది.

శ్రీవారి ఆలయం వద్ద ప్రమాణం చేయడం సీరియస్ మ్యాటరే. ఆ మాటకు వస్తే శ్రీవారి విషయంలో ఎవరు ఏమి మాట్లాడినా ఏ విధంగా వ్యవహరించినా తప్పు అయితే మాత్రం కచ్చితంగా పవర్ ఫుల్ గాడ్ అయిన స్వామి వారు కఠినంగా శిక్షిస్తారు అని అంటున్నారు.

ఇది మామూలు మాట అయితే కాదు కచ్చితంగా పాపం పండితే శిక్షలు ఉంటాయని అంటున్నారు. ఈ రోజుకు అయితే ప్రజలకు ఏమీ అర్థం కావడం లేదు. ఈ ఇష్యూ ఆధ్యాత్మికంగా కాకుండా రాజకీయం రంగు పులుముకుంటోంది. శ్రీవారిని కూడా మధ్యలోకి లాగుతున్నారా అన్న చర్చ నడుస్తోంది. మరి ప్రమాణాల వరకూ సవాళ్ళు ఇంకా ఎవరెవరు చేస్తారు బాబు కూడా ప్రమాణానికి వస్తారా అన్నది మాత్రం హాట్ హాట్ టాపిక్ గా ఉంది. చూడాలి మరి మరెన్ని ట్విస్టులు ఈ విషయంలో చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. అదే విధంగా రాజుకున్న ఈ మంట ఎపుడు చల్లారుతుందో తెలియదు అని అంటున్నారు.

Tags:    

Similar News