పొత్తులపైన తేల్చేసిన బాబు!

టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు పొత్తుల విషయంలో తేల్చేశారు. అయితే ఆ విషయం నర్మగర్భంగానే చెప్పుకొచ్చారు. తాము పొత్తులకు సుముఖం అని బాబు అన్నారు.

Update: 2023-08-29 11:47 GMT

టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు పొత్తుల విషయంలో తేల్చేశారు. అయితే ఆ విషయం నర్మగర్భంగానే చెప్పుకొచ్చారు. తాము పొత్తులకు సుముఖం అని బాబు అన్నారు. పొత్తులు టీడీపీకి కొత్త కాదని కూడా అన్నారు. గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రండ్, ఎన్డీయేలలో కీలక పాత్ర టీడీపీ పోషించింది అని ఆయన గుర్తు చేశారు. టీడీపీ జాతీయ భావాలు ఉన్న పార్టీ అని ఆయన చెప్పుకొచ్చారు.

బీజేపీతో టీడీపీకి ఎలాంటి విభేదాలు లేవని బాబు చెప్పడం విశేషం. తాము ప్రత్యేక హోదా అంశం విషయంలోనే గతంలో బీజేపీతో విభేదించి బయటకు వచ్చామని అన్నారు. ఏపీ పునర్నిర్మాణం కావాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో కలసి పనిచేయాల్సి ఉంటుందని బాబు చెప్పడాన్ని ఇక్కడ అండర్ లైన్ చేసి చదువుకోవాలి.

దీని బట్టి కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్న నేపధ్యంలో ఆ పార్టీలో కలసి పనిచేస్తామని, అది తమ కోసం కాదని ఏపీ అభివృద్ధి కోసమని బాబు చెబుతున్నారు. ఏపీ విభజన కారణంగా కంటే కూడా ఇపుడు దారుణంగా నష్టపోయిందని బాబు అన్నారు. ఏపీకి ప్రధాన సమస్య జగన్ మాత్రమే అని ఆయన అంటున్నారు. ఏపీని జగన్ పాలనంలో సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు.

ఇదిలా ఉంటే ఏపీలో పొత్తులు ఎపుడు ఎవరితో అన్నది ఎన్నికల వేళ తేలుతుందని బాబు అంటున్నారు. అంటే టీడీపీ వైపు నుంచి డోర్స్ ఓపెన్ చేసి ఉంచామని చెబుతున్నారన్న మాట. ఇదిలా ఉంటే ఎన్టీయార్ బొమ్మతో

వెండి నాణేన్ని ఢిల్లీలో ఆవిష్కరించిన నేపధ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన బాబు అక్కడ బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో మాట్లాడారు.

దీంతో ఏపీలో టీడీపీ బీజేపీ పొత్తులు ఖాయమని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దానికి మరింత బలమిచ్చేలా బాబు తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ పరిణామల తరువాత చూస్తే ఏపీలో జనసేన బీజేపీ టీడీపీ పొత్తు ఉంటుందని కూడా అంటున్నారు.

ఇక తెలంగాణాలో పొత్తులకు సమయం మించి పోయిందని ఆయన అంటూ టీడీపీ అక్కడ ఒంటరిగా పోటీ చేస్తుందని వివరించారు. ఏ స్థానానికి ఎవరు అభ్యర్ధి ఎక్కడెక్కడ పోటీ చేయాలి అన్న దాని మీద కమిటీ వేస్తున్నామని దాన్ని బట్టి నిర్ణయిస్తామని తెలిపారు.

మొత్తానికి చూస్తే తెలంగాణాలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ కోరినా అక్కడ తెలంగాణా సెంటిమెంట్ అస్త్రం వల్ల అది సాధ్యపడలేదని అంటున్నారు. తెలంగాణా ఎన్నికలు అయిపోయాక ఏపీలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పటికి పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుందని అంటున్నారు.

ఈ లోగా వైసీపీకి రాజ్యసభలో ఉన్న ఎంపీల బలంతో బీజేపీ తన బిల్లులను కూడా ఆమోదించుకుంటుందని ఆ మీదటనే బీజేపీ కూడా ఏపీ రాజకీయాల మీద ఒక క్లారిటీ ఇస్తుందని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే 2014 నాటి పొత్తులు ఏపీలో 2024లో సాధ్యమనే వాదనకు బలం చేకూరుతోంది.

Tags:    

Similar News