ఇంట్రస్టింగ్... షూ స్టైల్ మార్చిన చంద్రబాబు!
వాస్తవంగా చెప్పాలంటే... సినీ నటులకు, క్రికెటర్లకే కాదు రాజకీయ నాయకులకు అంతకుమించి అభిమానులు ఉంటారని అంటారు.
వాస్తవంగా చెప్పాలంటే... సినీ నటులకు, క్రికెటర్లకే కాదు రాజకీయ నాయకులకు అంతకుమించి అభిమానులు ఉంటారని అంటారు. అయితే.. క్రికెటర్లపై అభిమానాన్ని రెగ్యులర్ గా జరిగే మ్యాచ్ లలో.. నటులపై అభిమానాన్ని ఏడాదిలో కనీసం ఒకటి, రెండు, మూడు సార్లు విడుదలయ్యే వారి సినిమాలపైనా చూపిస్తుంటారు. ఇక వారి బర్త్ డేల నాటి సంగతి సరేసరి.
అయితే రాజకీయ నాయకుల అభిమానుల విషయానికి వచ్చే సరికి రోజూ వార్తల్లో వారిని ఫాలో అవుతున్నప్పటికీ... అభిమానాన్ని సాధారణంగా ఏడాదికి ఒక సారి వారి వారి బర్త్ డే లనాడు ఫ్లెక్సీలు కట్టడం, అన్నదానాలు చేయడం.., ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల నాడు మాత్రమే చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటుంటారు.
ఇదే సమయంలో తమ తమ అభిమాన నాయకుడు ధరించే డ్రెస్సింగ్ స్టైల్స్, ఫుట్ వేర్ స్టైల్, హెయిర్ స్టైల్ ని కూడా ఆయా రాజకీయ నాయకుల ఫ్యాన్స్ అనుసరిస్తుంటారు. అయితే ఈ విషయంపై పబ్లిసిటీ తక్కువగా ఉంటుంటుంది! గతంలో ఇలాంటి ఉదాహరణలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయనేది తెలిసిన విషయమే! ఈ క్రమంలో చంద్రబాబు డ్రెస్సింగ్ స్టైల్ గురించి తెలిసిందే.
గత ఎన్నో సంవత్సరాలుగా చంద్రబాబు.. ఇప్పుడు కనిపిస్తున్న డ్రెస్ కోడ్ లోనే కనిపిస్తుంటారు. అంతకు మించి మరో డ్రెస్ లో చంద్రబాబు కనిపించిన దాఖలాలు ఆల్ మోస్ట్ లేవనే చెప్పాలి! పూజల సమయంలో పంచెకట్టులో తప్ప! అయితే... డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ మార్చలేదు కానీ.. చంద్రబాబు తాజాగా షూ స్టైల్స్ మాత్రం మార్చినట్లు కనిపిస్తుంది.
అవును... హెయిర్ స్టైల్ సేమ్మ్, డ్రెస్సింగ్ స్టైల్ సేం గానే చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాతా మెయిటైన్ చేస్తూనే కనిపించారు కానీ... కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే... తాజాగా చంద్రబాబు తన షూ స్టైల్ మార్చినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా... గతంలో "మిడ్ టాప్ స్లిప్ ఆన్ లోఫర్స్" తరహా షూస్ వాడేవారు చంద్రబాబు.
అయితే తాజాగా "ఆక్స్ ఫర్డ్ షూస్ వితౌట్ లేస్" వాడుతున్నట్లు తాజా ఫోటోల్లో కనిపించింది. తాజాగా అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్నను ఛైర్ వద్దకు తీసుకెళ్తున్న సమయంలో చంద్రబాబు షూస్ ని కాస్త నిశితంగా పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుందని తెలుస్తుంది. మరి ఈ విషయంలో కూడా బాబుని ఫాలో అయ్యే ఆయన ఫ్యాన్స్ ఈ విషయాన్ని గమనించారా.. గమినిస్తే వారు కూడా తమ స్టైల్ మార్చుతున్నారా అనేది వేచి చూడాలి!
కాగా... వైఎస్ జగన్ డ్రెస్సింగ్ స్టైల్ తో పాటు పవన్ కల్యాణ్ చెప్పల్స్ స్టైల్ ని వారి వారి ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఫాలో అవుతుంటారనేది తెలిసిన విషయమే!