బాబుమోహన్ కు బిగ్ షాక్... మందా జగన్నాథంకూ తప్పలేదు!

మాజీ మంత్రి మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. వరంగల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించిన ఆయనకు ఈసీ షాకిచ్చింది!

Update: 2024-04-27 08:27 GMT

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందడి పీక్స్ కి చేరుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తవ్వడంతో ఇక అభ్యర్థులంతా ప్రచారాలపైనే పూర్తి దృష్టిసారించారు. ఈ సమయంలో సినీనటుడు, మాజీ మంత్రి మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. వరంగల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించిన ఆయనకు ఈసీ షాకిచ్చింది!

అవును... తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తవ్వడంతో.. ప్రస్తుతం వాటిని ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా.. 17 లోక్ సభ స్థానాలకు సంబంధించి 893 మంది అభ్యర్థులు 1488 నామినేషన్లు దాఖలు చేశారు.

అయితే వీటిలో సుమారు 267 నామినేషన్లను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. అయితే అనూహ్యంగా ఆ తిరస్కరించబడిన నామినేషన్ లలో బాబూ మోహన్ నామినేషన్ కూడా ఉండటం గమనార్హం. ఈయనతో పాటు మాజీ ఎంపీ మందా జగన్నాథం నామినేషన్ కూడా ఉంది. దీంతో... ఈ సీనియర్ నేతలిద్దరికీ ఈసారి బిగ్ షాక్ తప్పలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

వాస్తవానికి బాబూమోహన్ మార్చి 24న కేఏ పాల్ "ప్రజాశాంతి" పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో... పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబు మోహన్‌ ను నియమిస్తున్నట్లు పాల్ ప్రకటించారు. ఈ సమయంలో వరంగల్ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థిగా కూడా ప్రకటించారు.

అయితే నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అదే రోజు ప్రజాశాంతి పార్టీకి రాజీనామా చేసినట్లు బాబు మోహన్ వెల్లడించారు. అనంతరం వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బాబు మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన నామినేషన్‌ తోపాటు 10 మంది ఓటర్ల పేర్లను సమర్పించారు! అయినప్పటికీ ఆయన నామినేషన్ తిరస్కరించబడింది!

మరోపక్క నాగర్‌ కర్నూల్‌ లోక్ సభ నియోజకవర్గం నుంచి మంద జగన్నాథం దాఖలు చేసిన నామినేషన్‌ ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.. అయితే బీ-ఫారమ్‌ ను సమర్పించడంలో ఆయన విఫలమవ్వడం గమనార్హం.

ఇదే సమయంలో... నామినేషన్ పత్రాలపై 10 మంది అభ్యర్థులు సంతకాలు చేయాలన్న నిబంధన కూడా నెరవేరకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసే అవకాశం ఆయనకు రాలేదు. ఇదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించబడ్డాయని తెలుస్తుంది.

Tags:    

Similar News