ముగ్గురు పిల్లలున్నా ఓకే చంద్రబాబు సంచలన నిర్ణయం!
అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించుకుని, మండలికి పంపి.. అక్కడ కూడా ఓకే చేయించుకున్నాక.. రాష్ట్రపతికి పంపించాలి.
ఏపీలో చంద్రబాబు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల్లో కీలకమైన 'ఇద్దరు పిల్లల' వ్యవహారాన్ని చంద్రబాబు సర్కారు తోసిపుచ్చింది. వాస్తవానికి ఇది రాజ్యాంగ బద్ధమైన నిబంధన. దీనిని మార్పు చేసేందుకు చట్ట సవరణ చేయాలి. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించుకుని, మండలికి పంపి.. అక్కడ కూడా ఓకే చేయించుకున్నాక.. రాష్ట్రపతికి పంపించాలి. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు జరగనున్నా యి. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకు ఉన్న నిబంధనల మేరకు గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యేందుకు.. ఇద్దరు పిల్లల నిబంధనను 1970లలో తీసుకువచ్చారు. ఇది దేశవ్యాప్తంగా అమలవుతోంది. బిహార్, యూపీల్లో అయితే మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. కర్ణాటక 10 ఏళ్ల కిందట... తమిళనాడులో 15 ఏళ్ల కిందట.. ఈ చట్టాన్ని మార్పు చేశారు. జనాభా నియంత్రణకు అనుకూలంగా అప్పట్లో తీసుకువచ్చిన ఈ నిబంధన ప్రకారం..ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు చెందినవారు.. స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అవుతారు.
దీనివల్ల అయినా..జనభా నియంత్రణ జరుగుతుందన్నది అప్పటి సర్కారు ఆలోచన. దీనిని ఇప్పటికీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అయితే.. దీనిని అమలు చేసుకునే బాధ్యతలను మాత్రం రాష్ట్రాలకే అప్పగించారు. అందుకే.. ఇప్పటి వరకు ఏపీలో నూ దీనిని కొనసాగించారు. ఇప్పుడు మార్పులు చేయాలని చంద్రబాబు సూచించారు. దీని ప్రకారం.. ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబాలకు కూడా పోటీ చేసేందుకు అర్హత లభించనుంది. నలుగురు పిల్లలు ఉంటే మాత్రం మళ్లీ అనర్హులుగానే ఉండను న్నారు. తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయంగా కూడా..
వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబందించిన బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించుకుంటారు. అయితే.. ఇది రాజకీ యంగా వివాదం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే.. ఏ పార్టీకైనా.. సానుకూల నిర్ణయమే కాబట్టి.. దీనిని ఏ పార్టీ కూడా వ్యతిరేకించదు. గతంలో జగన్ కూడా ఈ మేరకు ప్రయత్నం చేసినా.. ఎందుకో విరమించుకున్నారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు మాత్రం నిర్ణయం తీసుకున్నారు. త్వరలో దీనిని బిల్లు రూపంలో తీసుకువచ్చి ఆమోదించుకుంటే.. చంద్రబాబు నిర్ణయం చట్టం రూపం దాల్చి అమలులోకి రానుంది. సో.. మొత్తానికి ఇది సంచలన నిర్ణయమనే చెప్పాలి.