తెనాలి తమ్ముళ్ల మిస్ పాలిటిక్స్.. నాదెండ్లకు చేదు అనుభవం
ఇందులో జనసేన తెనాలి అభ్యర్థి, ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు చేదు అను భవం ఎదురైంది. నాయకులు ముందుకు సాగుతుండగా.. ఒక కార్యకర్త.. నాదెండ్లను టార్గెట్ చేసుకుని వాటర్ బాటిల్‌ను విసిరేశారు.
టీడీపీ-జనసేన మిత్రపక్షం మధ్య సయోద్య కుదిరినా.. క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య సయోద్య మాత్రం ఇంకా కుదిరినట్టుగా లేదు. కలిసి పనిచేయాలి.. కలిసి పనిచేయాలి.. ముందుకు సాగాలి.. అని ఇరు పార్టీలనుంచి నాయకులు చెబుతు న్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆపరిస్థితి కనిపించడం లేదు. దీంతో చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. తాజాగా తెనాలిలో జరిగిన ఘటన ఇరు పార్టీల మధ్య ఇబ్బందికర పరిస్థితిని కల్పించింది.
తాజాగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థితో కలిసి.. జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమం తెనాలి నియోజకవర్గంలో జరిగింది. ఇందులో జనసేన తెనాలి అభ్యర్థి, ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు చేదు అను భవం ఎదురైంది. నాయకులు ముందుకు సాగుతుండగా.. ఒక కార్యకర్త.. నాదెండ్లను టార్గెట్ చేసుకుని వాటర్ బాటిల్‌ను విసిరేశారు. ఇది నేరుగా నాదెండ్ల తలకు బలంగా తగిలింది. దీంతో నాయకులు, ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. దీనిని లైట్ తీసుకునే పరిస్థితి లేదని.. స్థానికంగా ఉన్న పరిస్థితిని అద్దం పట్టిందని అంటున్నారు.
తెనాలి టికెట్‌ను టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆశిస్తున్నారు. అయితే.. ఆయనను ఒప్పించి.. బుజ్జగించి.. ఈ టికెట్‌ను మిత్రపక్షమైన జనసేనకు ఇచ్చేశారు. ఇక, ఇక్కడ నుంచి జనసేన తరఫున నాదెండ్ల పోటీ చేయనున్నారు. అయితే.. ఆలపాటి అనుచరులు కొన్నాళ్లుగా.. సహకరించేది లేదని చెబుతున్నారు. ఈ విషయంపైనా చంద్రబాబు ఆలపాటితో చర్చించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసుకునే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు. కానీ, ఆలపాటి మౌఖికంగా మాత్రమే సహకారంపై కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు.
దీనిని కార్యకర్తలు పాజిటివ్‌గా తీసుకోలేదు. ఫలితంగా నాదెండ్ల మనోహర్ టార్గెట్‌గా వాటర్ బాటిల్‌తో దాడి చేయడం గమనార్హం. ఇక, దర్శిలోనూ జనసేనకు టికెట్ ప్రకటించడంపై టీడీపీ కార్యకర్తలు రగిలిపోయారు. ఇటీవల పెద్ద రగడ చోటు చేసుకుంది. దీంతో ఏకంగా అభ్యర్థిని మార్చే పరిస్థితి వచ్చింది. ఇలానే.. తూర్పులోని రాజానగరంలోనూ జనసేన-టీడీపీ మధ్య విభేదాలు తెరమీదికి వచ్చాయి. ఈ పరిణామాలను క్షేత్రస్థాయిలో ఎన్నికలకు ముందే పరిష్కరించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.