ఇండస్ట్రీలో విషాదం... ‘బలగం’ మొగిలయ్య కన్నుమూత!
"బలగం" సినిమాతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (67) కన్నుమూశారు.
"బలగం" సినిమా ఓ ఆసక్తికరమైన సక్సెస్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. పల్లెల్లోని మనుషులు, వారి బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, కుటుంబ విలువలకు సంబంధించిన అంశాలతో రూపొందించిన ఆ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో... ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య కన్నుమూశారు.
అవును... "బలగం" సినిమాతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (67) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందూతూ ఈ రోజు (డిసెంబర్ 19) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
కాగా... తెలంగాణ పల్లె నేపథ్యంతో తెరకెక్కిన "బలగం" సినిమా క్లైమాక్స్ లో భావోద్వేగభరితమైన పాట పాడిన మొగిలయ్య.. ప్రేక్షకులందరితోనూ కంటతడి పెట్టించారనే చెప్పాలి. ఆ పాట ప్రేక్షకుల హృదయాలను తట్టిందని చెబుతారు. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.
ఈ క్రమంలో వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన మొగిలయ్య కిడ్నీ, గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆయన వైద్యం కోసం చిరంజీవి, "బలగం" సినిమా దర్శకుడు వేణు ఆర్థికసాయం అందించారు. అయితే.. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు.
దీంతో.. ఆయనను వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ సమయంలో చికిత్స పొందుతున్న మొగిలయ్య.. గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో... ఒక్కసారిగా విషాదం అలుముకుంది! మొగిలయ్య మరణం పట్ల "బలగం" దర్శకుడు వేణు, నటీనటులు, సాంకేతిక నిపుణులు సంతాపం ప్రకటించారు!