కేటీఆర్-రేవంత్‌పై బండి వారి ఆవేదన.. రీజనేంటి?
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ మాజీ సారథి.. బండి సంజయ్.. ఆవేదన, ఆందోళన చూసిన వారికి, విన్నవారికి కూడా .. అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి;

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ మాజీ సారథి.. బండి సంజయ్.. ఆవేదన, ఆందోళన చూసిన వారికి, విన్నవారికి కూడా .. అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరిపైనా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ సయామీ కవలలను మించిన రీతిలో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. ఇద్దరూ కలిసి బీజేపీ ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా అన్నారు. అంతేకాదు.. కేటీఆర్‌ను జైలుకు పంపించకుండా.. అడ్డు పడుతు న్నది.. ఆదుకుంటున్నది కూడా.. సీఎం రేవంత్‌రెడ్డేనని వ్యాఖ్యానించారు.
అయితే.. చిత్రం ఏంటంటే.. బీజేపీ ఎదుగుదలకు.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఎప్పుడు ఎలా అడ్డు పడ్డారో.. బండి సంజయ్ చెప్పాల్పి ఉంటుంది. ఎందుకంటే.. రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ఇద్దరు కూడా.. రాజకీయంగా ఉప్పు-నిప్పు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడి ప్పుడే.. ఉమ్మడి సమస్యలపై కలిసి సాగుతున్నారు. ఈ తరహా వాతావరణం లేకపోవడం వల్లే..రెండు తెలుగు రాష్ట్రాలు కూడా.. తీవ్రంగా నష్టపోతున్నాయి. అందుకే.. కేంద్రం తెస్తామని భావిస్తున్న పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై .. జనాభా ప్రాతిపదికను ఇరు పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
అందుకే.. తమిళనాడులో అక్కడి సీఎం స్టాలిన్ నిర్వహించిన ఉమ్మడి సమావేశానికి కేటీఆర్, రేవంత్ వెళ్లి.. ఒకే మాట వినిపిం చారు. అదేవిధంగా హిందీని బలవంతంగా రుద్దడం.. జీఎస్టీ నిధులను సక్రమంగా ఇవ్వకపోవడం వంటివాటిపైనా ఇరువురు నాయకులు ఒకే తరహా వాదన వినిపించారు. అంటే.. ఒకరకంగా.. ఇది రాష్ట్ర ప్రయోజనాల విషయంలో .. అధికార, విపక్షాలను కలివిడిగా ముందుకు తీసుకువెళ్తున్న పరిణామాన్ని సూచిస్తుంది. అయితే.. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న బండి సంజయ్.. ఆ ఇద్దరు సయామీ కవలలు అంటూ.. చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
అంతేకాదు.. బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని కూడా.. బండి వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఇదే జరిగి ఉంటే.. బీజేపీ ఈ స్థాయిలో.. బండి సంజయ్ కేంద్ర మంత్రి స్థాయిలోనూ ఉండే పరిస్థితి లేదు. అయినప్పటికీ.. బండి సంజయ్ మాత్రం తన నోటికి పదునెక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎదుగుదల అనేది.. ఆమాటకొస్తే.. ఏ పార్టీ ఎదుగుదల అయినా.. ప్రజల చేతుల్లోనే ఉంటుంది. మళ్లీ మాదే అధికారం అని చెప్పుకొన్నా.. కేసీఆర్‌ను ప్రజలు పక్కన కూర్చోబెట్టారే తప్ప.. అధికారం ఇవ్వలేదు. సో.. బండి సంజయ్.. వ్యాఖ్యలు.. కేవలం పనిలేని వ్యక్తి చేసే ఆరోపణలు తప్ప మరొకటి కాదని అంటున్నారు పరిశీలకులు.