నిద్రపోయి తొమ్మిది లక్షలు గెలుచుకున్న యువతి.. ఎక్కడో తెలుసా?

కడుపునిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అని అప్పట్లో పెద్దవారు చెప్పేవారు.

Update: 2024-09-26 05:48 GMT

కడుపునిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అని అప్పట్లో పెద్దవారు చెప్పేవారు. అయితే ఇప్పుడు ఉన్న హడావిడి జీవనశైలి కారణంగా అటు మాంచి తిండి లేదు.. ఇటు మంచిగా నిద్ర లేదు. పొద్దున ఎంత త్వరగా నిద్ర లేచి చదివితే అంత ఎక్కువ మార్కులు వస్తాయి అనే విద్యార్థులు.. రాత్రి దాకా మేలుకొని తెల్లవారు లేసి ఆఫీస్ కి హడావిడి పడే ఉద్యోగస్తులు.. ఇలా మన చుట్టూ ఎందరో ఉన్న సమాజంలో.. నిద్రపోయి ఓ అమ్మాయి 9 లక్షలు గెలుచుకుంది అంటే మీరు నమ్ముతారా.

అవునండి.. చాలామంది నిద్రకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎంత నిద్ర పోయినా కాస్త టైమ్ దొరికితే మళ్ళీ ఓ చిన్న కునుకేసి లేసే వాళ్ళని మనం ఎందరినో చూస్తూ ఉంటాం. బెంగళూరులో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన సాయిశ్వరి కి బాగా నిద్రపోవడం ఎంతో ఇష్టం. మనలో చాలామంది లోపంగా భావించే ఈ చిన్ని అలవాటు ఆమెకు తొమ్మిది లక్షలు తెచ్చిపెట్టింది. తనకున్న హాబీని డబ్బుగా మలుచుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఆమెకు ఓ గొప్ప అవకాశం దక్కింది.

ఓ ప్రముఖ పరుపుల కంపెనీ స్లీప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను నిర్వహించింది. దీనికిగాను రోజుకు 9 గంటల పాటు కంపెనీ తయారుచేసిన పరుపుపై నిద్ర పోవాల్సి ఉంటుంది. సహజంగా నిద్రపోవడం ఎంతో ఇష్టమైన సాయిశ్వరి ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం ని ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని భావించింది. దీని కోసం 12 మంది అభ్యర్థులు అప్లై చేయగా సాయిశ్వరి ఎంపికయింది.

అయితే 9 గంటల పాటు రెండు నెలలు ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం లో నిద్ర పోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా ఇది కాస్త కష్టమైన పని. కానీ నిద్ర అంటే ఎంతో ఇష్టపడే సాయిశ్వరి సృష్టిగా తిని రోజుకి 9 గంటలు నిద్ర హాయిగా పోయింది. అలా ఆమె సునాయాసంగా తన ఇంటెన్షిప్ ప్రోగ్రామ్ ని పూర్తి చేసి తొమ్మిది లక్షల రూపాయలు సంపాదించింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కావడంతో చాలామంది ఈ ఇంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది అని భావిస్తున్నారు. మరెందుకు ఆలస్యం మీకు కూడా ఇలాంటి మంచి నిద్రపోయే క్యాండిడేట్స్ తెలిస్తే వాళ్లకు ఈ ప్రోగ్రాం గురించి చెప్పండి.

Tags:    

Similar News