ఎంపీగా నామినేషన్ వేసిన బర్రెలక్క?

బర్రెలక్కగా ప్రసిద్ధి గాంచిన కర్నె శిరీష గురించి అందరికి తెలుసు. సామాజిక మాధ్యమాలతో ఓ వెలుగు వెలిగిన ఆమె సెలబ్రిటీగా మారిపోయింది

Update: 2024-04-23 12:25 GMT

బర్రెలక్కగా ప్రసిద్ధి గాంచిన కర్నె శిరీష గురించి అందరికి తెలుసు. సామాజిక మాధ్యమాలతో ఓ వెలుగు వెలిగిన ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. ఒక్క రోజులోనే తన జాతకం మారుమోగింది. దీంతో బర్రెలక్క గురించి అందరికి తెలుసు. బర్లు కాచుకునే పిల్లగా ఆమె సుపరిచితురాలు అయింది. ఈ నేపథ్యంలో ఆమె జీవితం ఓ పుస్తకంలా మారిపోయింది.

బర్రెలక్క సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగనుంది. నాగర్ కర్నూల్ పార్లమెంటరీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేసింది. మంగళవారం నామినేషన్ వేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం సాధించలేదు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి మూటగట్టుకుంది.

ఆ ఎన్నికల్లో బర్రెలక్క 5,754 ఓట్లు సాధించింది. కానీ విజయం దక్కలేదు. దీంతో నిరాశ చెందలేదు. విజయం సాధించే వరకు పోటీ చేస్తూనే ఉంటానని చెప్పింది. ఒక్కసారికే విజయం దొరకదు. పోరాడి సాధించుకోవాలని చెబుతోంది. ఎమ్మెల్యే కావాలనేది నా కల. కానీ ఇప్పుడు ఎంపీకి కూడా ప్రయత్నిస్తున్నాను. ప్రజల మద్దతు ఎలా ఉంటుందో చూడాలనుకుంటోంది.

బర్రెలక్క బాగా చదువుకున్న నిరుద్యోగి. ఉద్యోగం రాకపోవడంతోనే బర్రెలు కాచుకునే పని ఎంచుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తనకు ఈ గతి పట్టిందనేది ఆమె ఆరోపణ. ఈనేపథ్యంలో బర్రెలక్కను ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే ప్రజల పక్షాన నిలబడతానని చెబుతోంది. ప్రజా సమస్యలపై చట్టసభల్లో నిలదీసి న్యాయం జరిగేలా చూస్తానని అంటోంది.

బర్రెలక్కకు ఓట్లు వేస్తారా? ఆమెను ప్రధాన పోటీదారుగా అంగీకరిస్తున్నారా? పార్టీల అభ్యర్థుల మాదిరి గుర్తిస్తున్నారా? అంటే కాదనే సమాధానం వస్తోంది. ఆమెకు సరైన ఆదరణ లేకనే ఓటమి పాలవుతుందని పలువురు అనుకుంటున్నారు. ఆమె విజయం సాధిస్తే చూడాలని అందరు కోరుకుంటున్నారు. జనం గెలిపిస్తారా? లేదా చూడాల్సిందే మరి.

Tags:    

Similar News