షాకింగ్: రియాలిటీ షో సెట్ కోసం 118 కోట్లు
సాహసాలు, అద్భుతాలు చేస్తే యూట్యూబ్‌లో లైక్ లు క్లిక్ లకు కొదవేమీ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిని అలాంటి సాహసాలు, అద్భుతాలతో ఎలా ఆకట్టుకోవచ్చో నిరూపించాడు మిస్టర్ బీస్ట్.
సాహసాలు, అద్భుతాలు చేస్తే యూట్యూబ్‌లో లైక్ లు క్లిక్ లకు కొదవేమీ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిని అలాంటి సాహసాలు, అద్భుతాలతో ఎలా ఆకట్టుకోవచ్చో నిరూపించాడు మిస్టర్ బీస్ట్. రియాలిటీ టీవీ రంగంలో అతడు 26ఏళ్లకే ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు. తాజా రియాలిటీ షో `బీస్ట్ గేమ్స్` కోసం అమెజాన్‌తో కలిసి అతడు భారీ సెట్‌ను రూపొందించాడు.
అయితే దీనికోసం అతడు ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలిస్తే షాక్ కి గురవ్వాల్సిందే. దాదాపు 118 కోట్లు (14 మిలియన్ డాలర్లు) వెచ్చించి `బీస్ట్ గేమ్స్` రియాలిటీ షో సెట్ ని నిర్మించాడని తెలిసింది. అంతేకాదు ఈ రియాలిటీ షోలో 10 ఎపిసోడ్స్ ఉంటాయని, విన్ అయితే ఏకంగా 5 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నామని ప్రకటించాడు. రియాలిటీ షోల హిస్టరీలోనే అత్యంత భారీ ప్రైజ్ మనీ ఇదేనని తెలుస్తోంది. ఇది సాహసాలతో కూడుకున్న రియాలిటీ షో. ఇందులో పందెం నెగ్గాల్సి ఉంటుంది. సెట్ లో అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉంటాయి.
335 మిలియన్ ల సబ్‌స్క్రైబర్‌లతో మిస్టర్ బీస్ట్ యూట్యూబ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్. తోటి యూట్యూబర్‌లు KSI, లోగాన్ పాల్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు 40 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన షో కోసం 100 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించాడు. అమెజాన్ ప్రైమ్‌లో బీస్ట్ గేమ్స్ ప్రీమియర్ అవుతుంది. అతను గేమ్ షో కోసం ఖర్చు చేసిన డబ్బును ఎలా తిరిగి పొందాలని ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించగా... మిస్టర్ బీస్ట్ ఇలా అన్నాడు. అత్యుత్తమ కంటెంట్‌ని డబ్బు సంపాదించకుండా చేయడమే లక్ష్యం అని వ్యాఖ్యానించాడు.