పెంపుడు కుక్క మృతి తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని హెగ్గడదేవనురలో రాజశేఖర్ అనే 33 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. ఆయన చాలా కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కును పెంచుకుంటున్నాడు.
కొందరు జంతు ప్రేమికులను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా తమ పెంపుడు జంతువుల కోసం ఏం చేసేందుకు అయినా సిద్ధపడే వారు ఉంటారు. పెంపుడు కుక్కల విషయంలో కొందరు ఎంత సున్నితంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఒక హీరోయిన్ తమ పెంపుడు జంతువు చనిపోతే తన కొడుకు చనిపోయినంత బాధగా ఉందని ఎమోషనల్ అయ్యింది. తన రోజు వారి పనులు అన్ని పక్కన పెట్టినట్లు ఆమె పేర్కొంది. సెలబ్రెటీలు మాత్రమే కాకుండా సామాన్యులు సైతం పెంపుడు జంతువులు చనిపోయిన సమయంలో ఎంతగా బాధ పడుతారో మనం చూస్తూనే ఉంటాం.
పెంపుడు జంతువులు చనిపోయిన సమయంలో బాధ పడే వారు చాలా మంది ఉంటారు, కానీ బెంగళూరుకు చెందిన వ్యక్తి పెంపుడు జంతువు చనిపోయిన బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని హెగ్గడదేవనురలో రాజశేఖర్ అనే 33 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. ఆయన చాలా కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కును పెంచుకుంటున్నాడు. మంగళవారం ఆ కుక్క అనారోగ్యంతో చనిపోయింది. కుటుంబ సభ్యులు మొత్తం కుక్క మరణంతో కన్నీటి పర్యంతం అయ్యారు. ఇంట్లో మనిషిగా కలిసి పోయిన ఆ కుక్కకు అంత్యక్రియలు చేశారు.
బౌన్సీ పేరుతో ఇంటిలో మనిషిగా మెలిగిన ఆ కుక్క మరణంను రాజశేఖర్ జీర్ణించుకోలేక పోయాడు. ఎప్పుడూ తనతో ఉండే బౌన్సీ ఇక లేదని తెలిసి తట్టుకోలేక పోయిన రాజశేఖర్ తాను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. బౌన్సీ అంత్య క్రియలు పూర్తి చేసిన కుటుంబ సభ్యులతో పాటు రాజశేఖర్ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత కొద్ది సేపటికే బౌన్సీకి ఉపయోగించిన చైన్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే రాజశేఖర్ మృతి చెందినట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోవడం తట్టుకోవడం కష్టమే. అయితే అంతోటి దానికి ఆత్మహత్య చేసుకోవాలా అంటూ కొందరు రాజశేఖర్ తీరును వ్యతిరేకిస్తున్నారు. మనుషులు చనిపోతేనే మొండిగా ముందుకు వెళ్లి మన అనుకున్న వాళ్ల కోసం, మనం ప్రేమించే వాళ్ళ కోసం ముందుకు సాగాలి. అలాంటిది పెంపుడు కుక్క చనిపోయిందని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం అనేది ఏ మాత్రం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మానసికంగా బలంగా లేని వారు ఇలా జంతువులతో అటాచ్‌మెంట్ పెంచుకోవద్దు అంటూ మానసిక నిపుణులు సూచిస్తున్నారు.