భ‌ద్రాద్రి రామ‌య్య‌కు కోడ్ వ‌ర్తింపు.. ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న ఆదేశాలు!

ఇక‌, ఈ క‌ళ్యాణానికి ఆల‌య అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇక‌, క‌ళ్యాణాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న రామ‌య్య భ‌క్తులు క‌నుల విందుగా వీక్షించి క‌టాక్షం పొందుతారు.

Update: 2024-04-15 13:58 GMT

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కుల‌కు, పార్టీల‌కు, ప్ర‌భుత్వాల‌కు మాత్ర‌మే వ‌ర్తించే ఎన్నిక‌ల కోడ్‌.. భ‌ద్రాద్రి రామ‌య్య‌కు వ‌ర్తిస్తుందా? అంటే.. వ‌ర్తిస్తుంద‌నే చెప్పింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. భ‌ద్రాద్రి రామ‌య్య ఆల‌యం ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉన్నందున‌.. ఆల‌యంలో జ‌రిగే సీతారామ‌క‌ళ్యాణానికి కూడా కోడ్ వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం(ఈ నెల 17) జ‌రిగే.. సీతారామ క‌ళ్యాణాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఈ పేరుతో నాయ‌కులు , ప్ర‌భుత్వ పెద్ద‌లు హంగామా చేసేందుకు అవ‌కాశం లేద‌ని తేల్చి చెప్పింది.

వాస్త‌వానికి ఏటా చైత్ర శుద్ధ న‌వ‌మి రోజు.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని భ‌ద్రాచ‌లంలో సీతారామ‌క‌ళ్యాణాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తా రు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వ‌మే అధికారికంగా నిర్వ‌హిస్తుంది. దేవ‌దాయ‌శాఖ మంత్రి ప‌ట్టు వ‌స్త్రాలు కూడా స‌మ‌ర్పిస్తారు.

ఇక‌, ఈ క‌ళ్యాణానికి ఆల‌య అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇక‌, క‌ళ్యాణాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న రామ‌య్య భ‌క్తులు క‌నుల విందుగా వీక్షించి క‌టాక్షం పొందుతారు. దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డ రామ క‌ళ్యాణ్ జ‌రిగినా.. భ‌ద్రాద్రి రామ‌య్య క‌ళ్యాణానికి ప్ర‌త్యేకత వేరేగా ఉన్న విష‌యం తెలిసిందే.

అయితే, ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ ఉన్న నేప‌థ్యంలో ఏడాది జ‌రిగే రామ‌క‌ళ్యాణానికి ఈసీ నిబంధ‌న‌లు విధించింది. రాములులోరి క‌ళ్యాణాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డానికి వీల్లేద‌ని తెలిపింది. అదేవిధంగా నాయ‌కులు పాల్గొని హంగామా చేసేందుకు కూడా వీల్లేద‌ని తేల్చి చెప్పింది. దీనిని ఎన్నిక‌ల ప్ర‌చారానికి వాడుకునేందుకు కూడా అవ‌కాశం లేద‌ని పేర్కొంది.

అయితే.. ప్ర‌భుత్వ ప‌క్షాన స్వామివారికి స‌మ‌ర్పించే క‌ళ్యాణ వ‌స్త్రాల‌ను అధికారులు అంద‌జేయాల‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ నిర్ణ‌యంపై రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంషాక్‌కు గురైంది. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రుగుతున్న తొలి క‌ళ్యాణం కావ‌డంతో ఈసీ త‌న ఆదేశ‌ల‌ను స‌వ‌రించాల‌ని విన్న‌విస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News