ఆ టీడీపీ మహిళా నేత చాలా హాట్ గురూ... వివాదాలు చుట్టేస్తోంది..!
ఆమె మాజీ మంత్రి. ప్రస్తుతం ఎమ్మెల్యే. తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, దక్కలేదు.
ఆమె మాజీ మంత్రి. ప్రస్తుతం ఎమ్మెల్యే. తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, దక్కలేదు. దీనికి కారణాలు పెద్దగా ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్న అధికారం ఉన్నా.. రెచ్చిపోతు న్నారు. అసలు అధికారంలో లేకపోయినప్పుడే.. దూకుడు ప్రదర్శించారు. కానీ, ఆమె ఈ తప్పులను వెతుక్కుంటే బాగుండేది. కానీ, ఆ పని మానేశారు. ఇంకా చెలరేగిపోతున్నారు. అధికారంలో లేకపోయినా.. అంతా తనదే అన్నట్టుగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు.
ఆమే.. ఆళ్ల గడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా రెడ్డి. మంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించిన జోరునే ఇప్పు డు ఎమ్మెల్యేగా కూడా ప్రదర్శిస్తున్నారు. చిత్రం ఏంటంటే.. తన నియోజకవర్గం వరకు ఎంత దూకుడు ప్రదర్శించినా ఇబ్బంది లేదు. కానీ, జిల్లా వ్యాప్తంగా హల్చల్ చేస్తుండడం.. అంతా నేనే అన్నట్టుగా వ్యవహరించడం పార్టీకి, ఆమెకు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా విజయడెయిరీ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో ఆమె చేసిన వ్యవహారం వివాదం గా మారింది.
మరోవైపు... ప్రభుత్వ ఆఫీసుల్లో చంద్రబాబు ఫొటోలు లేవని.. కలెక్టర్‌పై చిందులు తొక్కారు. దీనికి అధికారులు నివ్వెర పోయారు. ఇక, విజయడెయిరీ ఆఫీసులోనూ చంద్రబాబు ఫొటోలు లేవని.. ఇంకా జగన్ ఫొటోలే ఉన్నాయని అఖిల ప్రియ చెబుతున్నారు. దీనిపై ఆమె పైరయ్యారు. కానీ, వాస్తవానికి దీనికి అంత చేయాల్సిన అవసరం లేదు. కేవలం చెబితే సరిపోతుంది. కానీ, మీడియాను వెంటేసుకుని వెళ్లి యాగీ చేయడం మాత్రం ఇబ్బందిగానే ఉంది.
దీనికి ముందు కూడా.. అఖిల ప్రియ దూకుడుగానే వ్యవహరించారు. వైసీపీ నేతలను మీడియా ముందే బెదిరించారు. హెచ్చరించారు. దీంతో చంద్రబాబు రియాక్టయి.. కొంత సంయమనం పాటించాలని మం త్రులు చూసుకుంటారని చెప్పారు. కానీ.. అఖిల ప్రియ ఆగడం లేదు. మంత్రులతోనూ కయ్యానికి దిగుతున్నారు. ఎవరితోనూ సత్సంబంధాలు లేవు. పైగా రెచ్చిపోతున్నారు. ఎవరు తనను ప్రశ్నించినా.. వైసీపీ కోవర్టులుగా ముద్ర వేస్తున్నారు. మీడియా ఏమైనా రాసినా.. రెచ్చిపోయి.. దూషిస్తున్నారు. ఇదీ సంగతి.. మరి ఇలాంటివారిని బాబు ఎలా లైన్‌లో పెడతారో చూడాలి.