మా ఆయన తెచ్చిన చీర.. నాకు హార్ట్ ఎటాక్ తెప్పించింది
మీరు కనీసం ఒక్క చీర కూడా తీసుకురారేం టని ప్రశ్నించా. ఆ తర్వాత.. చాలా ఏళ్ల తర్వాత.. సుమారు 30 ఏళ్లు అనుకున్నా.. అప్పడు ఒకే ఒక్క చీర తెచ్చారు.
'నిజం గెలవాలి' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. తాజాగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. సహజంగా అటు చంద్రబాబు కానీ, ఇటు నారా లోకేష్ కానీ.. ఇంట్లో సంగతులను బయట ప్రపంచంతో ఎప్పుడూ పంచుకోలేదు. ఇక, నారా భువనేశ్వరి.. గత ఏడాది చంద్రబాబును జైల్లో పెట్టిన ప్పటి నుంచి జనంలోనే ఉంటున్నా.. ఎప్పుడూ ఆమె కూడా .. ఇంట్లో సంగతులను పంచుకున్న దాఖలాలు లేవు.
పైగా.. చంద్రబాబు ఎప్పుడూ.. రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసమే ఆలోచన చేస్తున్నారని.. నారా భువనేశ్వరి రాజమండ్రిసెం ట్రల్ జైలు వద్ద వ్యాఖ్యానించారు. అయితే.. తాజాగా తమ కుటుంబంలో జరిగిన ఓఘటనను ఆమె సభలో వివరించారు. నిజం గెలవాలి యాత్ర సందర్భంగా అనంతపురంలో పర్యటించిన నారా భువనేశ్వరి.. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు, ముఖ్యంగా మహిళా నాయకులతో భేటీఅయ్యారు. ఈ సందర్భంగా తన భర్త, నారా చంద్రబాబు నాయుడు గురించి ఆసక్తిగా ఓ సంఘటనను వెల్లడించారు.
'ఆయన మీకు తెలుసు. ఆయన ప్రజల మనిషి. ఆయనకు భార్య, పిల్లలు, కుటుంబం అనేది సెకండ్. ముందు ప్రజలు, రాష్ట్రమే. ఫస్టు మీ గురించే ఆయన ఆలోచిస్తారు. ఒక్కసారి నేను అన్నాను. ఇతర భార్యల భర్తలు(మొగుళ్లు) వారి భార్యలకు చీరలు తెస్తారు. మీరు కనీసం ఒక్క చీర కూడా తీసుకురారేం టని ప్రశ్నించా. ఆ తర్వాత.. చాలా ఏళ్ల తర్వాత.. సుమారు 30 ఏళ్లు అనుకున్నా.. అప్పడు ఒకే ఒక్క చీర తెచ్చారు. దాన్ని చూసి నాకు హార్ట ఎటాక్ వచ్చింది. అంత ఘోరంగా ఉంది. ఎందుకంటే.. ఆ కలర్‌లు.. అవి చూసి! అయితే.. సంతోషించాను. ఎందుకంటే.. నా మొగుడు నాకొక చీర తెచ్చాడని. ఆ చీరను బీరువాలో పెట్టిదాచుకున్నాను'' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో అక్కడే ఉన్న మహిళానాయకులు.. పరిటాల సునీత, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తదితరులు పగలబడి నవ్వుకున్నారు.