బిగ్ బ్రేకింగ్... అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్!
అవును.. అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా.. అనంతరం కాసేపటికి తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ మంజూరైంది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు అనేకానేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా... అల్లు అర్జున్ ని శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేయడం.. అనంతరం వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించడం జరిగింది.
ఆ వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో.. అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించబడుతున్నారు! సరిగ్గా ఈ సమయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును.. అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా.. అనంతరం కాసేపటికి తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ మంజూరైంది. ఇదే సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది! దీంతో... ఇది అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ అనే భావించాలి. మరోపక్క ఫ్యాన్స్ షాక్ నుంచి తేరుకుంటున్నారని అంటున్నారు.