హైదరాబాద్ శివారులో బర్డ్ ఫ్లూ.. పూడ్చనున్న 17వేల కోళ్లు

మొన్నటివరకు ఏపీలోని ఫౌల్టీ ఫామ్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన బర్డ్ ఫ్లూ.. ఇప్పుడు హైదరాబాద్ శివారుకు చేరుకుంది.;

Update: 2025-04-04 04:12 GMT
Bird Flu Hits Hyderabad Outskirts 36,000 Chickens Infected

మొన్నటివరకు ఏపీలోని ఫౌల్టీ ఫామ్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన బర్డ్ ఫ్లూ.. ఇప్పుడు హైదరాబాద్ శివారుకు చేరుకుంది. ఒకే ఫామ్ లోని 36 వేల కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లుగా రంగారెడ్డి జిల్లా పశువైద్య.. పశు సంవర్థకశాఖ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ మహానగర శివారులో ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలోని ఒక ఫౌల్టీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లుగా గుర్తించారు.

ఈ ఫామ్ లో మొత్తం 36 వేల కోళ్లు ఉన్నాయి. ఇప్పటికే వేలాది కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయి. మిగిలిన 17,521 కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లుగా గుర్తించారు. దీంతో.. ఈ పౌల్టీలోని కోళ్లను చంపేసి పూడ్చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా కలకలంతో బాటసింగారానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లోని ఫామ్ లలోనూ నమూనాల్ని సేకరిస్తున్నారు అధికారులు.

ఇంటింటికి సర్వే చేపట్టటం.. ఎవరైనా బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఉంటే వారి వివరాల్ని సేకరిస్తున్నారు. తాజాగా బర్డ్ ఫ్లూ వెలుగు చూసిన నేపథ్యంలో సదరు ఫామ్ లోని సిబ్బంది సాయంతో 17వేలకు పైగా కోళ్లను చంపేసి.. మట్టిలో పూడ్చేచర్యలు చేపట్టనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో.. చికెన్ తినే ముందు కాస్త జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం.

Tags:    

Similar News