జైల్లో బిష్ణోయ్ ఇంటర్వ్యూ: ఏడుగురు పంజాబ్ పోలీసులు సస్పెండ్

రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి గురుకీరత్ కిర్పాల్ సింగ్ శుక్రవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2024-10-26 21:30 GMT

2022లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ జైలు నుంచి ఇంటర్వ్యూ ఇవ్వ‌డానికి స‌హ‌క‌రించిన‌ ఏడుగురు పంజాబ్ పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అజాగ్రత్త, స్థూల నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారులు గుర్షేర్ సింగ్, సమ్మర్ వనీత్ ఉన్నారు. లారెన్స్ బిష్ణోయ్ సెప్టెంబర్ 2022లో ఖరార్ సీఐఏ కస్టడీలో ఉన్నప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఇంటర్వ్యూ నిర్వహించారని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుర్తించిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు.

రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి గురుకీరత్ కిర్పాల్ సింగ్ శుక్రవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన ఇతర పోలీసులలో సబ్-ఇన్‌స్పెక్టర్ రీనా, CIA, ఖరార్ (SAS నగర్), సబ్-ఇన్‌స్పెక్టర్ (LR) జగత్‌పాల్ జంగు, AGTF, సబ్-ఇన్‌స్పెక్టర్ షాగంజిత్ సింగ్ (అప్పటి డ్యూటీ ఆఫీసర్), హెడ్ కానిస్టేబుల్ ఓం ప్రకాష్ ఉన్నారు.

జైపూర్ సెంట్రల్ జైలులో లారెన్స్ బిష్ణోయ్‌ను ఇంటర్వ్యూ చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం రాజస్థాన్ పోలీసులకు ఆధారాలు సమర్పించింది. అయితే విచార‌ణ‌లో జైల్లో ఇంటర్వ్యూ జరిగినట్లు తేలింది. బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ని చంపేస్తామ‌ని ప‌దే ప‌దే హెచ్చ‌రిస్తున్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నాడు. ఇటీవ‌ల స‌ల్మాన్ స్నేహితుడు సిద్ధిఖ్ ని అత‌డి అనుచ‌రులు తుపాకుల‌తో కాల్చి చంపారు. జైలు నుంచే అత‌డు ఒణికిస్తున్నాడు. దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో 700 మంది షూట‌ర్ల‌ను అతడు అదేశించ‌గ‌ల‌డు అంటే అత‌డు ఎంత‌టి శ‌క్తిమంతుడో అర్థం చేసుకోవ‌చ్చు. లారెన్స్ బిష్ణోయ్ కుటుంబానికి 150 ఎక‌రాల పొలం ఉంద‌ని, అత‌డు పుట్టుక‌తోనే ధ‌న‌వంతుడు అని వార్తా క‌థ‌నాలొచ్చాయి.

Tags:    

Similar News