కడపలో జగన్, అవినాష్ లకు చేదు అనుభవం... ఎంత నిజం?

అవును... కడపలో జగన్ ఇంట్లోకి చొరబడి కొంతమంది దుండగులు కిటీకీ అద్దాలు ధ్వంసం చేసారని.

Update: 2024-06-23 07:13 GMT

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మరుసటి రోజు తాడేపల్లి నుంచి కడపకు బయలుదేరి వెళ్లారు జగన్. ఈ సందర్భంగా ఆయనకు కడపలో ఘనస్వాగతం పలికారు శ్రేణులు. జగన్ కడప వచ్చారని తెలిసి భారీ ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులూ జగన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు జగన్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారనే వార్త హల్ చల్ చేసింది.

అవును... కడపలో జగన్ ఇంట్లోకి చొరబడి కొంతమంది దుండగులు కిటీకీ అద్దాలు ధ్వంసం చేసారని.. ఈ ఊహించని పరిణామంతో పార్టీ శ్రేణులు షాకయ్యాయయ్ని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఈ దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలే అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే ఈ విషయాలపై అటు వైసీపీ, పోలీస్ అధికారులు స్పందించారు. ఇందులో భాగంగ... జగన్ నివాసం వద్ద వైసీపీ శ్రేణులు తిరుగుబాటు చేశారనే వార్తల్లో నిజం లేదని.. కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది వైసీపీ. తప్పుడు కథనాలనే నమ్ముకున్న కొన్ని మీడియా సంస్థలు ఈ మేరకు అలాంటి ప్రచారలు చేస్తున్నాయని మండిపడింది.

మరోపక్క ఇదే విషయంపై పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ స్పందించారు. ఇందులో భాగంగా... పులివెందులలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నప్పుడు అంతా ఒకేసారి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారని.. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగి కిటికీ అద్దాలు పగిలాయని.. అంతేతప్ప పులివెందులలో ఎలాంటి రాళ్లదాడీ జరగలేదని తెలిపారు.

వైఎస్ అవినాష్ రెడ్డిని తోసేశారా?:

ఇదే సమయంలో.. జగన్ నిర్వహించిన ప్రజా దర్బార్ లో పాల్గొనేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చారు. ఈ సమయంలో ఆయనను పక్కకు తోసేశారనే ప్రచారం కూడా విస్తృతంగా సాగింది. దీనికి సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యింది. సీమలో పార్టీ ఓటమికి అవినాషే కారణం అంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారని పలువురు రాసుకొస్తూ ప్రచారం చేశారు.

దీంతో... ఈ విషయంపైనా వైసీపీ అగ్రనాయకత్వం స్పందించింది.. స్పష్టత ఇచ్చింది. ఇందులో భాగంగా... జగన్ ను చూడటానికి పెద్ద ఎత్తున జనం తరలిరావడం వల్ల తోపులాట చోటు చేసుకుందని గుర్తు చేసింది. ఆ సమయంలోనే అవినాష్ రెడ్డి కింద పడకుండా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది పట్టుకున్నారని తెలిపింది. వాస్తవాలు తెలియకుండా ఓక వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరింది.

Tags:    

Similar News