పవన్ ఉంటే చాలు... బీజేపీ ఫ్యూచర్ ప్లాన్స్ అదరహో !

ఏపీలో సొంత బీజేపీ నేతల కంటే జనసేన నేత పవన్ కళ్యాణ్ నే కేంద్ర బీజేపీ నేతలు ఇష్టపడుతున్నారు.

Update: 2024-11-03 04:13 GMT

ఏపీలో సొంత బీజేపీ నేతల కంటే జనసేన నేత పవన్ కళ్యాణ్ నే కేంద్ర బీజేపీ నేతలు ఇష్టపడుతున్నారు. ఆయననే గట్టిగా నమ్ముకుంటున్నారు. ఏపీలో బీజేపీ నేతలకు కొదవ లేదు. అదే సమయంలో ఏపీ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు తమ పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు.

కానీ మిత్రుడు అయిన పవన్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ విషయంలో చూపిస్తున్న అభిమానం ఎంతటితో ఇటీవల హర్యానా కి పవన్ వెళ్ళినపుడు కనిపించిన సన్న్వేశమే ఒక ఉదాహరణ. పవన్ కళ్యాణ్ ఒక క్రౌడ్ పుల్లర్, అంతే కాదు ఆయన రాజకీయంగా కూడా బీజేపీ భావ జాలానికి దగ్గర అవుతున్నారు.

అదే విధంగా ఆయన బలమైన సామాజిక వర్గంతో పాటు విశేషమైన యువత మహిళల మద్దతు కలిగి ఉన్నారు. ఆయనలో బలమైన నాయకుడిని బీజేపీ చూస్తోంది. ఏపీలో తాము ఎప్పటికైనా జెండా పాతాలీ అంటే అది పవన్ లాంటి సునామీతో జత కట్టడం వల్లనే సాధ్యమని బీజేపీ పెద్దలు గాఢంగా విశ్వైస్తున్నారు.

ఇదిలా ఉంటే పవన్ తో నిరంతరం ప్రధాని కార్యాలయం టచ్ లో ఉంటోంది అని అంటున్నారు. ఆయనతో అనేక విషయాలు కూడా పంచుకుంటున్నారు అని అంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పధకాల గురించి కార్యక్రమాల గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పవన్ తో తరచుగా చర్చిస్తూ ఉంటారని అంటున్నారు.

ఇక పవన్ సైతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల మీద తన అభిప్రాయాలను కూడా పంచుకుంటూ ఉంటారు అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాల మీద కూడా పవన్ ద్వారా జనంలోకి తీసుకుని వెళ్ళేందుకు కూడా కేంద్రం చూస్తోంది అని అంటున్నారు. పవన్ సైతం కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనేక సార్లు మీడియా ముఖంగా బయటా పంచుకుంటున్నారు అని అంటున్నారు.

ఇక కేంద్ర పెద్దలతో పవన్ కూడా పూర్తిగా టచ్ లో ఉంటున్నారు అని అంటున్నారు. ఆయన ఇటీవలనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బర్త్ డే విషెస్ చెప్పారు అని గుర్తు చేస్తున్నారు. అలాగే జాతీయ స్థాయిలో ఏ సంఘటన జరిగినా కూడా ఆయన రియాక్ట్ అవుతున్నారు అని కూడా అంటున్నారు.

ఈ విధంగా పవన్ తోనే అంతా అన్నట్లుగా బీజేపీ కేంద్ర పెద్దలు వ్యవహరించడానికి ఎన్నో కారణాలు తెర వెనక ఎన్నో వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. ఈ వైఖరి ధోరణి చూస్తూంటే సరైన సమయంలో పవన్ కి బిగ్ ఎలివేషన్ పొలిటికల్ గా ఇస్తూ ఆయన జనసేన పార్టీని బీజేపీలో కలుపుకోవడానికి కూడా చూస్తారు అని అంటున్నారు.

ఏపీ రాజకీయాల్లో బీజేపీ శకం మొదలవ్వాలీ అంటే పవన్ అన్న బలమైన తుఫాను వీచాల్సిందే. అది తమకు అనుకూలంగా ప్రత్యర్ధులను తుడిచిపెట్టే విధంగా వీస్తేనే కమలం ఆంధ్రాలో వికసిస్తుంది అన్నది బీజేపీ పెద్దలకు తెలుసు అని అంటున్నారు. అందుకే పవన్ ని వారు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ కూడా పక్కా జాతీయ వాదిగా మారుతున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News