తెలంగాణాలోనూ ఎన్డీయే కూటమి...అమిత్ షా సరికొత్త వ్యూహం ?
ఏపీలో ఎన్డీయే కూటమి కట్టినప్పుడల్ల ఘన విజయమే దక్కుతూ వస్తోంది. అది 2014, 2024లో రుజువు అయింది.
ఏపీలో ఎన్డీయే కూటమి కట్టినప్పుడల్ల ఘన విజయమే దక్కుతూ వస్తోంది. అది 2014, 2024లో రుజువు అయింది. ఇక తెలంగాణాలో చూస్తే ఉమ్మడి ఏపీలో ఉన్నపుడు ఎన్డీయే కూటమి కట్టి మంచి ఫలితాలను టీడీపీ బీజేపీ అందుకున్నాయి. ఇక 2018 ఎన్నికల తరువాత టీడీపీ తెలంగాణా పట్ల రాజకీయ ఆసక్తిని తగ్గించేసింది.
జనసేన విషయం తీసుకుంటే 2023 ఎన్నికల్లో బీజేపీతో కలసి అక్కడ పోటీ చేసింది. ఇక 2024లో ఏపీలో బంపర్ మెజారిటీతో అధికారం దక్కడంతో బాబు తెలంగాణాలో పార్టీ విస్తరణ గురించి ఆలోచన చేస్తున్నారు. సీరియస్ గానే దాని మీద ఉన్నారు.
ఈ నేపధ్యంలో ఏపీకి వచ్చిన కేంద్ర హోం మంత్రి బీజేపీ వ్యూహకర్త అయిన అమిత్ షా చంద్రబాబు నివాసంలో విందారగించారు. ఈ సందర్భంగా అనేక విషయాలు ఆయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లతో చర్చించారు అని భోగట్టా. ఈ క్రమంలోనే అమిత్ షా తెలంగాణాలో సైతం ఎన్డీయే కూటమిని విస్తరించాలని ప్రతిపాదించారని తెలుస్తొంది.
దానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ అంగీకరించినట్లుగా చెబుతున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రెండవ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది. మూడవ ప్లేస్ లో బీజేపీ ఉంది. బీజేపీకి 2028 అధికారం ముఖ్యంగా ఉంది. తెలంగాణాలో పీఠం అందుకోవాలని చూస్తోంది. దాంతో అనేక రకాలైన రాజకీయ ఎత్తుగడలను వేస్తోంది.
ఈ నేపధ్యంలో నుంచే అమిత్ షా ఈ కీలక ప్రతిపాదన చేసి ఉంటారని అంటున్నారు. తెలంగాణాలో టీడీపీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఈ రోజుకీ ఎన్టీఆర్ పట్ల ఆదరణ ఉన్న వారు ఉన్నారు. అలాగే చంద్రబాబుకు హైటెక్ సిటీ నిర్మాతగా పేరు ఉంది.
మరో వైపు పవన్ కళ్యాణ్ కి కూడా తెలంగాణాలో అపారమైన అభిమాన జనం ఉన్నారు. ఆయన సామాజిక వర్గం కూడా గట్టిగా ఉంది. దాంతో ఈ మూడు పార్టీలు జత కడితే తప్పకుండా కాంగ్రెస్ బీఆర్ ఎస్ లను ధీటుగా ఎదుర్కొని అధికారం అందుకోగలమన్న నమ్మకం అయితే బీజేపీ పెద్దలతో కనిపిస్తోంది అని అంటున్నారు.
ఇక తెలంగాణాలో వెంటనే ఉన్నవి స్థానిక ఎన్నికలు అని అంటున్నారు. ఆ ఎన్నికలు ఈ ఏడాది మధ్యలో జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా ఈ మూడు పార్టీలు పోటీ చేయాలని ఆలోచిస్తున్నాయని అంటున్నారు. ఈ మూడు పార్టీల కలయికను ప్రజలు ఎలా స్వీకరిస్తారు, బీజేపీలోని తెలంగాణా నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, బీఆర్ఎస్ ఆంధ్రా వాదాన్ని ఏ విధంగా వినిపిస్తుంది అన్నవి కూడా ఈ మినీ అసెంబ్లీ ఎన్నికల్లో తేలుతుంది అని అంటున్నారు.
అందుకే లిట్మస్ టెస్ట్ గా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి ఆ మీదట మంచి ఫలితాలు అందుకుంటే కనుక దానిని కంటిన్యూ చేస్తూ 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి కొనసాగిస్తారు అని అంటున్నారు. ఇక తెలంగాణాలో ఎన్డీయే కూటమి విస్తరణకు సంబంధించి ఉండవల్లిలోని బాబు ఇంట్లో అమిత్ షా ప్రస్తావించినా దాని వెనక భారీ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఢిల్లీలో మరోమారు భేటీ వేసి కీలక నిర్ణయం ఈ విషయంలో తీసుకోవాలని కూడా ఆయన కోరారని అంటున్నారు.
నిజంగా కనుక ఎన్డీయే కూటమి తెలంగాణాలో పోటీ చేస్తే మంచి ఫలితాలే వస్తాయని అంటున్నారు. చంద్రబాబు పవన్ బలానికి తోడు బీజేపీ వ్యూహాలు అమిత్ షా మోడీ చరిష్మా తోడు అయితే కచ్చితంగా గెలుపు సాధిస్తారు అని అంటున్నారు. ఈ విషయాల మీద పూర్తి రాజకీయ అవగాహన ఉండబట్టే అమిత్ షా ఈ విధంగా ప్రతిపాదన చేశారు అని అంటున్నారు.
ఇక భౌగోళికంగా వేరుగా ఉన్నా రెండు చోట్లా తెలుగు వారే ఉన్నారు. ఇక ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రజల సెంటిమెంట్ వారి అభిప్రాయాలు అన్నీ కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి ఈ ప్రయోగం హిట్ అవుతుందని కూడా లెక్క వేస్తున్నారు. మొత్తానికి ఏపీకి అమిత్ షా రావడం ద్వారా ఎన్డీయే కొత్త బంధానికి బాటలు వేశారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.