ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై కొత్త సస్పెన్స్!

పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలకు పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని తెలుస్తుంది.

Update: 2024-03-13 04:55 GMT

పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలకు పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని తెలుస్తుంది. మరోపక్క 10 + 6 మాత్రమే కాదు.. ఈ లెక్క మారినా మారొచ్చనే చర్చ కూడా తెరపైకి వస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో 15మంది అభ్యర్థుల జాబితాను పురందేశ్వరి.. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు అందజేసినట్లు చెబుతున్నారు.

ఒకవేళ ఈ 10+6 స్థానాలే ఫైనల్ అయినా... అక్కడ పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలోనూ ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని తెలుస్తుంది. ఈ విషయంలో మొదటినుంచీ పార్టీలో ఉన్నవారిని కాకుండా... పక్కపార్టీల నుంచి వచ్చిన వారికే టిక్కెట్లు ఇస్తున్నారనే చర్చ బీజేపీలోని కొంతమంది కీలక నేతలు భావిస్తున్నారని.. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలను కలబోతున్నారని అంటున్నారు. అయితే బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలపై కొంతవరకూ క్లారిటీ వచ్చిందని తెలుస్తుంది.

ఈ విషయంపై పూర్తిక్లారిటీ రావడానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం... విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, పి.గన్నవరం నుంచి అయ్యాజీ వేమ పోటీ చేసే అవకాశాలు ఆల్ మోస్ట్ ఫైనల్ అయ్యయని తెలుస్తుంది. ఇక మిగిలిన అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా అప్రూవల్ కోసం హస్తినకు వెళ్లిందని అంటున్నారు.

ఇదే క్రమంలో... బీజేపీ పోటీ చేయబోయే ఆరు లోక్ సభ స్థానాల్లోనూ ప్రస్తుతానికి నలుగురు అభ్యర్థులు కన్ ఫాం అయ్యారని సమాచారం. ఇందులో భాగంగా... రాజమండ్రి నుంచి పురందేశ్వరి, తిరుపతి నుంచి మునిసుబ్రహ్మణ్యం, నరసాపురం నుంచి రఘురామ కృష్ణంరాజు, అరకు నుంచి కొత్తపల్లి గీత దాదాపు ఖరారయ్యారని తెలుస్తుంది.

ఇక బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ విధంగా ఉన్నాయని సమాచారం!

విశాఖ ఉత్తరం – విష్ణుకుమార్ రాజు

శ్రీకాకుళం

పాడేరు

అనపర్తి

పి.గన్నవరం - అయ్యాజీ వేమ

కైకలూరు

గుంటూరు వెస్ట్

జమ్మలమడుగు - ఆదినారాయణ రెడ్డి

ధర్మవరం

గుంతకల్లు

మదనపల్లె

రాజంపేట

Tags:    

Similar News