డబుల్ ఇంజన్ సర్కారులో బీజేపీ సాయమెంత ?
జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా.. ఇదే ప్రచారాన్ని ఊదర కొట్టారు.
ఎన్నికలకు ముందు.. బీజేపీ నాయకులు చేసిన ప్రకటన గుర్తుందా? ``కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం వస్తే.. అభివృద్ధి పరుగులు పెడుతుంది. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే.. ఇక తిరుగు ఉండదు`` అని బీజేపీ నాయకులు ప్రకటించారు. ఊరూ వాడా కూడా.. కమల నాథులు ఇదే ప్రచారాన్ని తీసుకువెళ్లారు. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా.. ఇదే ప్రచారాన్ని ఊదర కొట్టారు.
దీంతో ప్రజలు ఏమనుకున్నారో.. ఏమో,.. ఎన్డీయే కూటమికి ఇక్కడ అధికారం ఇచ్చారు. కేంద్రంలోనూ ఎన్డీయే కకూటమి వచ్చింది. మరి ఏపీకి ఒరిగిన సాయం ఎంత? అనేది ఇప్పుడు లెక్కలు తీస్తే.. కనీసం ఏపీని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇక, చంద్రబాబు కూడా ఎన్నికలకు ముందు.. `కేంద్రం సాయంతో సూపర్ సిక్స్‌ను అమలు చేస్తాం`` అని చెప్పారు. మరి సూపర్ సిక్స్‌కు కేంద్రం ఇచ్చిన సాయం ఎంత? అని చూస్తే.. అది కూడా కనిపించడం లేదు.,
కేవలం అమరావతికి రూ.15 వేల కోట్ల రూపాయలు అప్పులుగా ఇప్పిస్తామన్నారు. ఇది ఎవరు కట్టాలో అర్థం కాలేదు. వడ్డీ ఎవరు భరించాలో కూడా చెప్పలేదు. ఇక, పోలవరం విషయాన్ని తీసుకుంటే.. అసలు ఎంతిస్తారో కూడా చెప్పలేదు. కనీసం.. నగదు రూపంలో ఎంత సాయం చేస్తారో ప్రకటించలేదు. వెనుక బడిన జిల్లాల విషయాన్ని తీసుకుంటే.. వాటికి గతంలోనే నిధులు ఇచ్చాం.. ముందు వాటికి లెక్కలు చెప్పాలని.. తర్వాత.. ఇస్తామని ప్రకటించారు.
అంటే.. డబుల్ ఇంజన్ సర్కారు వచ్చినా.. ఏపీకి ఒరిగింది ఏమీ లేదనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. మరి బీజేపీని గెలిపించిన ప్రజలకు ఇదేనా సాయం చేసేది? అనే ప్రశ్నలకు కమల నాథులు మాట్లాడడం లేదు. పైగా.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తామన్న మాటను కూడా వెనక్కి తీసుకోలేదు. ప్రస్తుతం హైకోర్టు స్టేటస్ కో(యథాతథ స్థితి)ని విధించబట్టి సరిపోయింది. లేకపోతే.. ఏం టి పరిస్థితి? ఎలా చూసుకున్నా.. డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడింది.. కానీ, కేంద్రం మాత్రం పాత విధానంలోనే ముందుకు సాగుతోంది.