.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

బీజేపీ : గుజరాత్ లో అలాగే ఉంటుంది బాస్ !

అయితేనేం ఆయన జన్మదిన వేడుకలు పోలీసులు అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించారు.

Update: 2024-06-29 15:30 GMT

ఆయన పేరు హిమాన్షు చౌహాన్. అర్హత బీజేపీ నేత. రాష్ట్రం : గుజరాత్ అంతకుమించి ఆయనకు ఏ అర్హతా ఆయనకు లేదు. అయితేనేం ఆయన జన్మదిన వేడుకలు పోలీసులు అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వేడుకలకు డీసీపీ కనన్ దేశాయి హాజరై ఇతర పోలీసుల సమక్షంలో కేక్ కట్‌చేసి చౌహాన్‌కు హ్యాపీ బర్త్ డే అంటూ కేక్ తినిపించడం విశేషం. కనీసం వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తి జన్మదిన వేడుకలు పోలీస్ స్టేషన్లో నిర్వహించడం ఏంటని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

‘బీజేపీ కార్యాలయంగా మారిన పోలీస్ స్టేషన్’ అంటూ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. అయితే అది బర్త్ డే సెలబ్రేషన్ కాదని, హిందూ-ముస్లిం ఐక్యతకు సంబంధించిన బ్లడ్ డొనేషన్ డే అని వివరణ ఇచ్చారు. అయితే వీడియోలో మాత్రం పోలీసులు అందరూ బీజేపీ నేత హిమాన్షుకు ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అని గట్టిగా చెప్పడం గమనార్హం.

పోలీసులు గుజరాత్‌లోని బీజేపీ కార్యాలయంలో ఉద్యోగుల్లా మారిపోయారని కాంగ్రెస్ నేత అమిత్ చావ్లా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆశ్చర్యపడాల్సింది ఏమీ ఉండదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News