పెద్ద కష్టమే.. కేసీఆర్.. హరీశ్ ఫ్యూచర్ ఇదేనంటూ ఫైర్ బ్రాండ్ ఫైర్
తాను ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బయట ఇన్ని ఆధారాలు పెట్టినా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాలతో పాటు.. జాతీయ స్థాయిలో భారీ ఎత్తున సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ కు సంబంధించి ఫ్యూచర్ లోఏం జరగనుంది? అన్న అంశంపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కం ఫైర్ బ్రాండ్ రఘనందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఏమేం చేయాలన్న దానిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 2014 జూన్ 2 నుంచి ఫోన్ ట్యాపింగ్ లపై విచారణ జరిపింది.. తప్పు చేసిన వారికి తగిన శిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు.
అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ అంశంలో సీఎం రేవంత్ తీరును ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బయట ఇన్ని ఆధారాలు పెట్టినా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నిస్తున్నారు. అన్ని తెలిసిన ముఖ్యమంత్రి.. ట్యాపింగ్ అంశంలో సగం మాత్రమే బయటపెట్టం సరికాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అంచనా కట్టిన రఘునాందన్ రావు.. ‘‘ఏ1గా కేసీఆర్.. ఏ2గా హరీశ్ రావు.. ఏ3గా వెంకట్రామిరెడ్డి.. ఏ4గా మాజీ మంత్రి కేటీఆర్ పేర్లు ఉండనున్నట్లుగా వ్యాఖ్యానించారు.
2015లో రేవంత్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్కన పెట్టి.. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ లపై విచారణ ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మునుగోడు.. దుబ్బాక ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ ఎందుకు ప్రస్తావిస్తారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.
ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు అయిన రేవంత్ రెడ్డి నాటి రోజును గుర్తు చేస్తూ.. ‘‘రేవంత్ ను అరెస్టు చేసినప్పుడు అప్పటి డీజీపీ అనురాగ్ శర్మ.. సిటీ పోలీస్ కమిషనర్ ప్రస్తుత టీఎస్పీఎస్పీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి.. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి.. ఎస్ బీఐలో ఉన్నది ప్రస్తుత ఆర్టీసీ ఛైర్మన్ సజ్జనార్ ఉన్నారు. మరి.. వారిని పక్కన పెట్టి.. విషయాల్ని దాచి పెడుతున్నారేంటి?’’ అంటూ రఘునందన్ ప్రశ్నిస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల వేళ తన ఫోన్ ట్యాప్ జరిగిందని తాను డీజీపీకి చెప్పానని.. అప్పటి జిల్లా కలెక్టర్ ప్రస్తుత మెదక్ బీఆర్ఎస్ అభ్యర్తి వెంకట్రాంరెడ్డి.. మాజీ మంత్రి హారీశ్ లను ముద్దాయిలుగా చేయాలని తాను చెప్పిన తర్వాత కూడా అలాంటిదేమీ జరగలేదన్నారు. ‘‘మునుగోడు ఉప ఎన్నికల్లో రూ.3.5 కోట్లు పట్టుకున్నారు. ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అయినప్పటికీ ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ.30 కోట్లు ఎక్కడ? అని ప్రశ్నించారు.
అంతేకాదు.. ప్రస్తుతం ఒకటి తర్వాత ఒకటిగా బయటకు వస్తున్న ట్యాపింగ్ అంశాలకు సంబంధించి మరో కీలక ప్రశ్నను సీఎం రేవంత్ కి సంధించారు రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింక్ కేసులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ .. నాటి డీజీపీ పేర్లను ఎందుకు చేర్చలేదు? అన్న ప్రశ్నను సంధించారు. అంతేకాదు.. ఫోన్ ట్యాపింక్ కేసులో మొదటి ముద్దాయిగా కేసీఆర్.. ఆ తర్వాత హరీశ్.. వెంకట్రామ రెడ్డి.. కేటీఆర్.. నవీన్ రావు.. సందీప్ రావుల పేర్లను జాబితాలో చేర్చాలన్న డిమాండ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే.. ఎన్నికల తర్వాత కూడా తెలంగాణ రాజకీయాల్ని ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వెంటాడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.