బాబు ప్రమాణ స్వీకారానికి రాని బీజేపీ ఎమ్మెల్యే

ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని భారీ విజయం సాధించింది

Update: 2024-06-12 09:45 GMT

ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని భారీ విజయం సాధించింది. తాజాగా కృష్ణా జిల్లా కేసరపల్లి వేదికగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లతో కలిపి 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో టీడీపీ నుండి 20, జనసేన నుండి ముగ్గురు, బీజేపీ నుండి ఒక్కరు మంత్రి పదవులు పొందిన వారిలో ఉన్నారు.

అయితే ఈ ప్రమాణ స్వీకారానికి కూటమి ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. టీడీపీ నుండి చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి నాని ఎన్నికల అనంతరం జరిగిన హింసలో వైసీపీ నేతల దాడులలో గాయపడ్డాడు. ఈ రోజు ప్రమాణ స్వీకారానికి వీల్ చైర్ లో హాజరయ్యాడు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి కూటమి తరపున ఉన్న బీజేపీ హాజరుకాలేకపోయాడు.

ఇటీవల ఎన్నికల్లో కైకలూరు నుండి విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేకపోయాడు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తోపాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారిని పేరుపేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.

Tags:    

Similar News