లోకేష్ తో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ... తెరపైకి వైసీపీ 'గోపి'లపై చర్చ!

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Update: 2024-07-22 11:02 GMT

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిరోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీలో 2014 - 19 సమయంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెట్టిందని.. చంద్రబాబు తీవ్ర కృషి చేశారని.. 2019 తర్వాత రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడిపోయిందని.. అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.

మరోపక్క రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. వైసీపీ కార్యకర్తలే లక్ష్యంగా హత్యలు, దాడులూ జరుగుతున్నాయని ఆరోపిస్తూ... "హత్యారాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ" అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి, మెడలో నల్లకండువాలి వేసుకుని నిరసన తెలియజేశారు. ఈ సమయంలో సభలో గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ సభ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

ఈ నేపథ్యంలో... గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అనంతరం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ మీటింగ్ జరిగింది. అయితే... అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి లోకేష్ ను ఆయన చాంబర్ లో కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... అసెంబ్లీ ముగిసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి సత్యకుమార్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పార్థసారథి, ఈశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... చాలా మంది వైసీపీ నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని లోకేష్ వద్ద ప్రస్థావించారు.

అయితే... ఈ విషయంలో తాము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదని, అలాంటివి ఏమైనా ఉంటే కలిసి కూర్చుని చర్చించాకే నిర్ణయం ఉంటుందని లోకేష్ తో అన్నారు. దీంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నుంచి గోడదూకడానికి సిద్ధంగా ఉన్న ఆ నేతలు ఎవరు అనే చర్చా అప్పుడే మొదలైపోయింది.

Tags:    

Similar News