బోయింగ్ భారీ షాకింగ్ నిర్ణయం... 17వేల మంది ఉద్యోగులపై వేటు!

అవును... ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-12 06:43 GMT

ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ కారణం అని ఒకరంటే.. ప్రాజెక్టులు లేక అని మరొకరు.. భారం తగ్గించుకునే ప్రయత్నంలో భాగం అని ఇంకొకరు.. కారణం ఏదైనా ఇటీవల కాలంలో బడా బడ కంపెనీలు వందల, వేల సంఖ్యలో సిబ్బందిపై వేటు వేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బోయింగ్ భారీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

అవును... ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. సమ్మె చేస్తున్న కార్మికుల కారణంగా సంస్థకు నష్టం వాటిల్లినట్లు చెబుతూ.. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 17వేల మంది సిబ్బందిపై ఒకేసారి వేటు పడనుందని అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ సంస్థ సమ్మె ప్రభావాన్ని ఎదుర్కోంటోంది. ఇందులో భాగంగా... సుమారు నెల రోజులుగా సియాటెల్ ప్రాంతంలో దాదాపు 33,000 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో... 767, 777, 737 మ్యాక్స్ జెట్ ల ఉత్పత్తి నిలిచిపోయింది.

ఫలితంగా... మూడో త్రైమాసికంలో 5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన కంపెనీ సీఈఓ కెల్లీ ఓర్ట్ బర్గ్... సమ్మె కారణంగా సంస్థకు భారీ నష్టాలు వచ్చాయని.. అందువల్ల సంస్థ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. ఇందులో భాగంగా ఈ నష్టాలను పూడ్చేందుకు ఉద్యోగుల తొలగింపు అవసరమని అన్నారు.

ఈ నేపథ్యంలోనే రానున్న నెలల్లో మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10శాతం (దాదాపు 17,000) మందిని తగ్గించాలని చూస్తున్నట్లు వెల్లడించారు. వీరిలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ లూ ఉంటారని స్పష్టం చేశారు. ప్రస్తుతం సంస్థ ఉన్న పరిస్థితుల్లో.. దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవడానికి ఇలాంటి కఠిన చర్యలు తప్పనిసరి అని ఆయన తెలిపారు!

ఇదే సమయంలో... సుమారు నెల రోజులుగా సాగుతున్న ఈ సమ్మె ఫలితంగా ఉత్పత్తి నిలిచిపొవడంతో 777ఎక్స్ జెట్ డెలివరీలు ఆలస్యం అవ్వనున్నట్లు సంస్థ తెలిపింది. వీటి డెలివరీలు 2026లో అందిస్తామని వెల్లడించింది.

Tags:    

Similar News