ఒక్క వీడియో దెబ్బకు బోర్న్ వీటా షుగర్ 14% తగ్గేలా చేసింది

అందులో బోర్న్ వీటా మీద తాను సాధించిన విజయాల్ని షేర్ చేసుకోవటమే కాదు.. తన వీడియో దెబ్బకు బోర్న్ వీటాలో షుగర్ కంటెంట్ 14 శాతానికి తగ్గిన వైనాన్ని వెల్లడిస్తూ వీడియోను షేర్ చేశారు

Update: 2023-12-27 04:28 GMT

సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక వీడియో ఒక కార్పొరేట్ దిగ్గజాన్ని తగ్గేలా చేసింది. తన తప్పును తప్పనిసరి పరిస్థితుల్లో సరి చేసుకోవాల్సి వచ్చింది. 8 నెలల క్రితం అప్పట్లో తెగ వైరల్ అయిన ఒక వీడియోలో.. ప్రముఖ చాక్లెట్ డ్రింక్ గా పేర్కొనే బోర్న్ వీటా చేసే తప్పులను ఎత్తి చూపటం సంచలనంగా మారింది. ప్యాక్ మీద పేర్కొన్న సమాచారానికి.. ఆ కంపెనీ ఉత్పత్తికి ఏ మాత్రం పోలిక లేదంటూ పేర్కొన్న వీడియో వైరల్ గా మారటమే కాదు.. సదరు వీడియో పోస్టు చేసిన యువకుడికి లీగల్ నోటీసును పంపింది. ఈ మొత్తం వ్యవహారం పెను దుమారాన్ని రేపింది.

కట్ చేస్తే.. 8 నెలల అనంతరం.. సదరు వ్యక్తి మరో వీడియోను పోస్టు చేశారు. అందులో బోర్న్ వీటా మీద తాను సాధించిన విజయాల్ని షేర్ చేసుకోవటమే కాదు.. తన వీడియో దెబ్బకు బోర్న్ వీటాలో షుగర్ కంటెంట్ 14 శాతానికి తగ్గిన వైనాన్ని వెల్లడిస్తూ వీడియోను షేర్ చేశారు. సుమారు 8 నెలల క్రితం రేవంత్ హిమంత్ సింకా ఒక వీడియోను ఇన్ స్టాలో పోస్టుచేశాడు.

దాని సారాంశం.. ప్రముఖ క్యాడ్ బరీ సంస్థకు చెందిన బోర్న్ విటా చాక్లెట్స్.. హెల్త డ్రింక్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు. ప్రతి వంద గ్రాముల పొడిలో సుమారు37.4 గ్రాముల చక్కెర ఉందని.. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయటమే కాదు.. ఇది నిజంగానే ఆరోగ్యానికి హానికారమంటూ పేర్కొన్నారు. బోర్న్ వీటాతాగితే డయాబెటిస్ పేషెంట్లుగా మారుస్తుందన్న తీవ్రమైన ఆరోపణ చేశారు.

అంతేకాదు.. బోర్న్ వీటా ప్యాక్ లేబుల్ మీద పేర్కొన్న అంశాలన్ని అబద్ధాలేనని.. ఇందులో వాడే షుగర్ తో డయాబెటిస్.. ఉపయోగిస్తున్న ఫుడ్ కలర్స్ క్యాన్సర్ కు దారి తీస్తుందన్నారు.ఈ ఆరోపణల్ని సదరు క్యాడబరీ సంస్థ తీవ్రంగా తప్పు పట్టింది. తమను దెబ్బ తీయటానికి తప్పుడు ప్రచారాన్ని చేపడుతున్నట్లుగా మండిపడింది. అయితే.. అతగాడి వీడి నెట్టింట్ సూపర్ వైరల్ గా మారింది.

ఈ వీడియోను పలువురు ప్రముఖులు షేర్ చేశారు. దీంతో బోర్నవీటా పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి. ఇలాంటివేళ.. హిమంత్ కు లీగల్ నోటీసులకు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ అంశాన్ని లేవనెత్తిన హిమంత్ కు క్యాడ్ బరీ సంస్థ లీగల్ నోటీసుల్ని పంపింది. అయితే.. దీనికి అతగాడు బెదర్లేదు. ఇదిలా ఉంటే.. 8 నెలలు గడిచేసరికి.. న్యాయస్థానంలో బోర్న్ వీటా చేసే తప్పుల్ని న్యాయస్థానం గుర్తించంది. దీనికి కారణం హిమంత్ సింకా ఒక అద్భుతమైన పని చేశారు.

ఇతడి వాదనను ఎనిమిది మంది వైద్యులు.. పోషకాహార నిపుణులతో కూడిన ప్రముఖ భారతీయ పోషకార సంస్థ సైతం హేమంత్ లేవనెత్తిన అంశాలన్ని నిజమని తేల్చింది. అదే సమయంలో తాజాగా హేమంత్ మరో వీడియోను షేర్ చేవాడు. అందులో మరో సంచలన అంశాల్ని షేర్ చేవారు. అదేమంటే.. 8 నెలల పోరాటానికి ఫలితం అన్నట్లుగా బోర్న్ వీటాలో షుగర్ శాతాన్ని 14.4 శాతానికి తగ్గించినట్లుగా పేర్కొన్నారు. చరిత్రలో తొలిసారి సోషల్ మీడియా కారణంగా ఒక ప్రముఖ కంపెనీ తనను తాను మార్చుకోవటం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వేళ.. హిమంత్ మళ్లీ స్పందిస్తూ.. తాను ఎవరికి వ్యతిరేకం కాదని.. ఎవరైతే తప్పుగా లేబుల్ చూపిస్తూ.. తప్పుడు మార్కెటింగ్ పద్దతుల్ని అనుసరిస్తే మాత్రం వారి తప్పుల్ని ఎత్తి చూపేందుకు తాను అస్సలు వెనుకాడనంటూ చెబుతున్న అతగాడి కొత్త వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. నిజానికి ఉన్న పవర్ ఏమిటన్నది కూడా మరోసారి స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News