శ్రీనివాస్ గౌడ్ కు షాక్!... టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సీరియస్!

ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులపై వివక్ష చూపుతున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ మంత్రి, బీఆరెస్స్ నేత శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-12-20 05:25 GMT

తెలంగాణ విడిపోయిన సమయంలోనే కానీ, గత వైసీపీ ప్రభుత్వంలో కానీ తమకు ఇబ్బందులు లేవని.. ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులపై వివక్ష చూపుతున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ మంత్రి, బీఆరెస్స్ నేత శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై టీటీడీ ఛైర్మన్ సీరియస్ గా స్పందించారు.

అవును... గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్... తెలంగాణకు చెందిన భక్తులపై తిరుమలలో వివక్ష చూపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో పుట్టిన ప్రతీ బిడ్డ.. శ్రీవారిని దర్శించుకుని, తలనీలాలు సమర్పించుకుంటారని అన్నారు.

ఇదే సమయంలో... గతంలో ఏపీ తెలంగాణ విడిపోయిన సమయంలో తెలంగాణ భక్తులకు కొండపై అన్ని రకాల సౌకర్యాలు కల్పించేవారని.. అప్పట్లో ఎలాంటి వివక్షా చూపించలేదని.. వైసీపీ హయాంలో కూడా ఎటువంటి వివక్ష లేదని.. అయితే, ఈ మధ్యకాలంలో మాత్రం తెలంగాణ భక్తులపై తిరుమలలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... తిరుమల పవిత్ర క్షేత్రమని.. ఇది రాజకీయ వేదిక కాదని.. రాజకీయంగా తిరుమలను ఏ ఒక్కరూ వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో... తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనకడుగు వేయకూడదనే తమ పాలకమండలి తొలి సమవేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా... తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే అది ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా... ఇటీవల తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజ్యకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపిన టీటీడీ ఛైర్మన్... అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News