బ్రెయిన్ ఇంప్లాంట్... ఆలోచనలతో అమెజాన్ అలెక్సాను నియంత్రించొచ్చు!

అవును... శరీరంలోని అవయువాలు క్షీణించిన వ్యాధితో బాధపడే వారికి టెక్ కంపెనీ సింక్రాన్ శుభవార్త చెప్పింది.

Update: 2024-09-17 17:30 GMT

శరీరంలోని అవయువాలు, కండరాలు క్షిణించిన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి అమెజాన్ అలెక్సా డిజిటల్ అసిస్టెంట్ ను తన ఆలోచనలతో ఆదేశించగలిగాడు. ఈ సాంకేతిక ఆవిష్కరణ వెనుక ఉన్న సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ఓ వ్యక్తి కేవలం ఆలోచనలే షోలను ప్రసారం చేయడానికి, పరికరాలను నియంత్రించడానికి అనుమతిస్తుందని సంస్థ వెల్లడించింది.

అవును... శరీరంలోని అవయువాలు క్షీణించిన వ్యాధితో బాధపడే వారికి టెక్ కంపెనీ సింక్రాన్ శుభవార్త చెప్పింది. కేవలం మెదడు సంకేతాలు ఆధారంగానే అలెక్సాకు కమాండ్స్ ఇచ్చే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా... 64ఏళ్ల రోగి పై ఈ ప్రయోగం సక్సెస్ ఫుల్ గా పూర్తి అయినట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా స్పందించిన సంస్థ... అమియోట్రోఫిక్ లాటరల్ స్ల్కెరోసిస్ (ఏ.ఎల్.ఎస్) అనే వ్యాధితో బాధపడుతున్న మార్క్ అనే పేషెంట్ ఈ ప్రయోగం వల్ల.. స్మార్ట్ హోమ్ డివైజ్ ను నియోగించడం, వీడియో కాల్స్ చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం, షోలను స్ట్రీమ్ చెయడం వంటికి మెదడు సాయంతో అలెక్సాకు కమాండ్స్ ఇవ్వగలిగారని తెలిపింది.

ఇదే క్రమంలో... స్పందించిన సింక్రాన్ వ్యవస్థాపకులు, సీఈవో టామ్ ఓక్సెలీ... స్మార్ట్ హోమ్ సిస్టమ్ టచ్ లేదా వాయిస్ కమాండ్లతో పనిచేస్తాయని.. అయితే తాము మాత్రం నేరుగా మెదడు నుంచే సంకేతాలు పంపిస్తున్నట్లు తెలిపారు.. ఆ సంకేతాలతోనే వాటన్నింటినీ ఆపరేట్ చేయొచ్చని వెల్లడించారు.

మరోపక్క తన అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నాడు మార్క్. ఇందులో భాగంగా... తనకు అవసరమైన ముఖ్యమైన పనులను చేసుకోవడం, ఎంటర్ టైన్మెంట్ ను యాక్సెస్ చేయడం వంటివి చేయగలుగుతున్నట్లు తెలిపాడు. ఇదే క్రమంలో... తాను కోల్పోయిన స్వేచ్ఛను ఇప్పుడు పొందినట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు.

కాగా.. అమియోట్రోఫిక్ లాటరల్ స్ల్కెరోసిస్ (ఏ.ఎల్.ఎస్) అనేది డీజనరేటివ్ నరాల వ్యాది. ఇది శరీర అవయువాలను, కండరాలను బలహీనపరిచి పక్షవాతానికి గురి చేస్తుంది.

Tags:    

Similar News