పెళ్లి పీటల నుంచి పరీక్ష కేంద్రానికి.. మమత విశేషం
చిత్తూరు జిల్లాకు చెందిన మమత అనే యువతి తన పట్టుదలతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె పెళ్లి పీటల నుంచి నేరుగా తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రానికి చేరుకుంది.
ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్న సందర్భంలో, చిత్తూరు జిల్లాకు చెందిన మమత అనే యువతి తన పట్టుదలతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె పెళ్లి పీటల నుంచి నేరుగా తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రానికి చేరుకుంది.
ఈ ప్రత్యేక ఘటనలో మమత వివాహం అనంతరం ఎక్కడా సమయం కోల్పోకుండా, తన పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. పెళ్లి తర్వాత పరీక్షకు సిద్ధం కావడం .. ఇతర అడ్డంకులను అధిగమించడంలో ఈ యువతి ప్రదర్శించిన శ్రద్ధ , సంకల్పాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
మమత మాట్లాడుతూ "పెళ్లి తర్వాత కూడా నా విద్య, నా లక్ష్యాలను పక్కన పెట్టకుండా కొనసాగించాలని అనుకుంటున్నా.. అందువల్ల ఎప్పటికప్పుడు అన్ని అడ్డంకులను ఎదుర్కొని, పరీక్షకు హాజరయ్యాను," అని చెప్పింది.
ఈ క్రమంలో, మమత పట్టుదల చూసి పరీక్ష కేంద్రంలో పలువురు అభినందనలు తెలిపారు. ఆమె చర్య యువతులకు ప్రేరణగా మారింది, సమయం, పరిస్థితులు ప్రతిసారీ మారినా, సమర్ధత, పట్టుదల ఉంటే ఏ పని సాధించగలమని ఈ ఘటనద్వారా అర్తమవుతోంది.
అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొని తన లక్ష్యాన్ని సాధించడానికి ఆమె చూపించిన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.