సబ్ కలెక్టర్ కావాలని కల.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా....!
అలాంటి కేసీఆర్‌కు తాజాగా రేవంత్‌రెడ్డి `మీరు బాగుండాలి. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి`` అని శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు మధ్య రాజకీయ లడాయి అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవడంలో ఇరువురు నాయకులు కూడా ఒకరిని మించి ఒకరు ప్రయత్నిస్తారు. ఇటీవల కూడా.. గత పదేళ్ల కేసీఆర్ పాలనను రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. అలాంటి కేసీఆర్‌కు తాజాగా రేవంత్‌రెడ్డి `మీరు బాగుండాలి. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి`` అని శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.
సోమవారం(ఫిబ్రవరి 17) కేసీఆర్ 71వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. 1954, ఫిబ్రవరి 17న జన్మించిన కేసీఆర్.. గురువును మించిన శిష్యుడిగా రాజకీయాలలో ఎదిగారు. తనరాజకీయ గురువు మదన్ మోహన్ పైనే ఇండిపెండెంటుగా పోటీ చేసిన కేసీఆర్.. తర్వాత కాలంలో ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడిచి.. వరుస విజయాలు అందుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తన ఆలోచనా తీరును కూడా మార్చుకునే లక్షణం కేసీఆర్ సొంతం అని అంటారు పరిశీలకులు.
ఎప్పటికప్పుడు మార్పుల దిశగా అడుగులు వేశారు. ఒకే పార్టీలో ఆయన ఎల్లకాలం ఉండలేకపోయారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. దీనిని కూడా జాతీయస్థాయికి విస్తరించాలన్నది కేసీఆర్ కల. ఇక, 2014-23 మధ్య సుదీర్ఘంగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విద్యాధికుడు, తెలుగు భాషపై ఎనలేని అభిమానం ఉన్న కేసీఆర్.. గాయకుడు, రచయిత, చిత్రకారుడు అంటే.. ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పదికి పైగా పాటలు రాశారు. కరువుపై .. సొంత గళంతో పాటలు పాడారు.
కాగా, నేడు 71వ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఏపీ మాజీ సీఎం, కేసీఆర్‌కు చిరకాల మిత్రుడు.. జగన్ సహా.. అనేక మంది నాయకులు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో తనదైన శైలిని అవలం భించిన కేసీఆర్.. జాతీయ స్థాయిలో ఎదగాలని పలువురు నాయకులు కోరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. కూడా కేసీఆర్ సుదీర్ఘకాలం ఆరోగ్యంతో ఉండాలని..కోరుకున్నారు. అదేవిధంగా కేసీఆర్ తనయుడు.. కేటీఆర్.. తన తండ్రిని కారణ జన్ముడిగా అభివర్ణించారు. చిత్రం ఏంటంటే.. గ్రూప్-1 రాసి.. సబ్ కలెక్టర్ అవ్వాలని కలలు కన్న.. కేసీఆర్.. మదన్ మోహన్ కారణంగా రాజకీయాల బట్టడం!!