కేటీఆర్ లక్ష్యం నెరవేరిందా..? అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత!

అయితే.. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన కేటీఆర్ రేవంత్, అదానీ దోస్తీ అంటూ టీషర్టులతో నిరసన తెలిపారు. దీంతో అతడిని అసెంబ్లీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

Update: 2024-12-09 06:54 GMT

ఈ మధ్య తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒకటే వార్త వైరల్ అయింది. కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు.. కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు.. అని. గత నెలన్నర రోజులుగా ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ కేటీఆర్ మాత్రం అరెస్ట్ కాలేదు. అటు కేటీఆర్ సైతం నిత్యం ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూ వచ్చారు. కానీ.. ప్రభుత్వం కూడా ఏ మాత్రం ఆవేశానికి పోకుండా తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది.

కేటీఆర్ నిత్యం కావాలనే రెచ్చగొడుతున్నారనే ఉద్దేశంతో.. ప్రభుత్వం కూడా అతడిని అరెస్ట్ చేయకుండా ఉంది. తనను జైలుకు పంపితే పంపుకోమనండి.. ఏ కేసు పెడుతారో పెట్టుకోండి.. ఎన్ని రోజులు జైల్లో పెడుతారో పెట్టండి.. అంటూ సవాల్ విసిరారు.

నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గత ఏడాది సేమ్ ఇదే రోజుల ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేశారు. నేడు సచివాలయం కేంద్రంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం ఆవిష్కరించబోతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు.

అయితే.. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన కేటీఆర్ రేవంత్, అదానీ దోస్తీ అంటూ టీషర్టులతో నిరసన తెలిపారు. దీంతో అతడిని అసెంబ్లీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. అదానీ, రేవంత్ ఫొటోలతను ముద్రించిన టీషర్టులను ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకున్నారు. దీంతో వారందరినీ గేటు ముందే పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలందరినీ అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News